BJP MLA : బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష

ఉత్తర్​ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీకి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కాలేజీలో అడ్మిషన్ కోసం నకిలీ మార్క్స్ లిస్ట్ సమర్పించిన కేసులో సోమవారం ఇంద్ర ప్రతాప్ తివారీ

BJP MLA : బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష

Up (1)

BJP MLA ఉత్తర్​ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీకి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కాలేజీలో అడ్మిషన్ కోసం నకిలీ మార్క్స్ లిస్ట్ సమర్పించిన కేసులో సోమవారం ఇంద్ర ప్రతాప్ తివారీని దోషిగా తేల్చిన ఫైజాబాద్ లోని ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు..ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూజా సింగ్ ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేను కస్టడీలోకి తీసుకొని జైలుకు పంపించారు. కాగా, అయోధ్యలోని గోసాయ్‌గంజ్ నియోజకవర్గానికి తివారీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అసలేం జరిగింది

ఇంద్ర ప్రతాప్ తివారీ డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఫెయిలయ్యారు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఫెయిల్ అయినప్పటికీ..1990లో తప్పుడు మార్క్​షీట్​తో తర్వాతి ఏడాదికి తివారీ అడ్మిషన్ తీసుకున్నారని అయోధ్యలోని సాకేత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామ్ త్రిపాఠి 1992లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 13 ఏళ్ల తర్వాత ఛార్జ్​షీట్ పూర్తైంది.

విచారణ సమయంలో ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ త్రిపాఠి సైతం మరణించారు. చాలా వరకు ఒరిజినల్ ధ్రువపత్రాలు కనిపించకుండా పోయాయి. పత్రాల జిరాక్సులు,సెకండరీ కాపీలతోనే న్యాయస్థానంలో విచారణ జరిగింది. సాకేత్ కాలేజీ అప్పటి డీన్ మహేంద్ర కుమార్ అగర్వాల్​తో పాటు మరికొందరు తివారీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. 28 ఏళ్ల సుదీర్ఘకాలంపాటు సాగిన ఈ కేసులో తివారీని దోషిగా తేల్చి సోమవారం శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం.

ALSO READ  ‘హిందీ వస్తేనే డబ్బులు తిరిగి ఇస్తాం’..కస్టమర్‎కు షాకిచ్చిన జోమాటో