Apartment: ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ ఇదే! ధర ఎంతో తెలుసా?

ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ హాంగ్‌కాంగ్‌లో అమ్ముడైంది. భారతీయ రూపాయల్లో రూ. 610కోట్లకు అపార్ట్‌మెంట్ అమ్ముడుపోయింది.

Apartment: ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ ఇదే! ధర ఎంతో తెలుసా?

Apart Ment

Apartment: ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ హాంగ్‌కాంగ్‌లో అమ్ముడైంది. హాంకాంగ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ 640మిలియన్ల హాంకాంగ్ డాలర్లకు.. భారతీయ రూపాయల్లో రూ. 610కోట్లకు అపార్ట్‌మెంట్ అమ్ముడుపోయింది. రిచ్ హౌస్ మార్కెట్‌లో చదరపు అడుగు చాలా ఖరీదైనదిగా చెబుతున్నారు.

మౌంట్ నికల్సన్ వద్ద ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌‌ని నగరంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఉన్నత స్థాయి ప్రాజెక్ట్‌లలో ఒకటిగా గుర్తించారు. వార్ఫ్ హోల్డింగ్స్ లిమిటెడ్.. నాన్ ఫంగ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, దీనిని చదరపు అడుగు HK$140,800కి అమ్మింది. హాంకాంగ్ ద్వీపంలోని విలాసవంతమైన నివాస ప్రాంతం పీక్‌లో ఈ అపార్ట్‌మెంట్ మూడు పార్కింగ్ స్థలాలతో 4,544 చదరపు అడుగులల్లో దీనిని నిర్మించారు.

దాదాపు తొమ్మిది నెలల క్రితం CK అసెట్ హోల్డింగ్స్ లిమిటెడ్21 బోరెట్ రోడ్ ప్రాజెక్ట్ నెలకొల్పిన రికార్డును ఇది బద్దలు కొట్టింది. హాంకాంగ్ వ్యాపారవేత్త విక్టర్ లీ సంస్థ ఫిబ్రవరిలో అపార్ట్‌మెంట్‌ను చదరపు అడుగుకి HK$136,000కి అమ్మారు.

లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి ఇది కాగా.. చైనీస్, సంపన్న స్థానిక నివాసితుల నుంచి బలమైన డిమాండ్ కారణంగా సంవత్సరం ద్వితీయార్ధంలో ఉన్నతస్థాయి గృహాల ధరలు 3% పెరుగాయి. ఈ క్రమంలోనే భారీ థరకు ఈ అపార్ట్‌మెంట్లు అమ్ముడవుతున్నాయి.

Read More:

Calendars and Diaries: ఆన్‌లైన్‌లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. VIPబ్రేక్ దర్శనాలు రద్దు