Antique Pieces: రూ.40 కోట్ల విలువైన హిందూ దేవతల పురాతన విగ్రహాలు స్వాధీనం

నిందితుడు కాశ్మీర్ కు చెందిన జావేద్ షా.. గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులోని మామల్లాపురంలో "ఇండియన్ కాటేజ్ ఎంపోరియం" పేరుతో విగ్రహాల దుకాణం నిర్వహిస్తున్నాడు

Antique Pieces: రూ.40 కోట్ల విలువైన హిందూ దేవతల పురాతన విగ్రహాలు స్వాధీనం

Idols

Antique Pieces: హిందూ దేవుళ్ళ పురాతన విగ్రహాలను అక్రమంగా సేకరించి వాటిని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మి అక్రమంగా డబ్బుసంపాదిస్తున్న ఒక వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కాశ్మీర్ కు చెందిన జావేద్ షా.. గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులోని పర్యాటక ప్రాంతం మామల్లాపురంలో “ఇండియన్ కాటేజ్ ఎంపోరియం” పేరుతో విగ్రహాల దుకాణం నిర్వహిస్తున్నట్టు..విగ్రహాల అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు తెలిపారు. తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబుకు వచ్చిన పక్కా సమాచారంతో జావేద్ షాకు చెందిన “ఇండియన్ కాటేజ్ ఎంపోరియం”పై పోలీసులు దాడి చేశారు.

Also Read: Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం

అత్యంత అరుదైన పార్వతిమాత విగ్రహం జావేద్ వద్ద ఉందన్న సమాచారంతో అధికారులు మంగళవారం నాడు దాడులు నిర్వహించగా..ఆ విగ్రహం లభించలేదు. అయితే తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అత్యంత విలువైన 11 పురాతన విగ్రహాలు లభించాయి. వీటిలో గణేశుడు, కృష్ణుడు, పది తలల రావణాసురుడి విగ్రహాలు సహా ఎనిమిది అత్యంత విలువైన విగ్రహాలు ఉన్నాయి. అయితే పార్వతి దేవి విగ్రహం కోసం బుధవారం నాడు మరోసారి తనిఖీలు చేపట్టగా.. అమ్మవారి విగ్రహం లభించింది. స్వాధీనం చేసుకున్న విగ్రహాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.35-40 కోట్లు ఉంటుందని అంచనా.

Also read: Harish Rao : అవసరం అయితేనే హైదరాబాద్‌కు రండి-హరీష్‌రావు సూచన

కాశ్మీర్ కు చెందిన జావేద్ షా గత కొన్నేళ్లుగా చెన్నైలో స్థిరపడ్డాడు. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాతో అత్యంత దగ్గరి సంబంధాలు కలిగిన జావేద్.. భారత్ నుంచి పురాతన విగ్రహాల తరలిస్తున్న ముఠాలో అగ్రగణ్యుడుగా పోలీసులు పేర్కొన్నారు. ఇతడి ఆధ్వర్యంలో అనేక విలువైన పురాతన విగ్రహాలు భారత్ నుంచి తరలివెళ్ళిపోయినట్లు తమిళనాడు విగ్రహాల అక్రమ రవాణా నిరోధక విభాగం ఏడీజీపీ జయంత్ మురళి తెలిపారు. విగ్రహాల అక్రమ రవాణాలో ఆరితేరిన జావేద్ షాను విచారిస్తే అంతర్జాతీయంగా ఉన్న ముఠాసభ్యులను వెలుగులోకి తేవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Also read: Covid in Delhi:కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయి..రెండురోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తాం : వైద్యశాఖా మంత్రి