డిసెంబర్12న ‘మామాంగం’
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హిస్టారికల్ డ్రామా.. ‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్) డిసెంబర్12న విడుదల..
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హిస్టారికల్ డ్రామా.. ‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్) డిసెంబర్12న విడుదల..
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హిస్టారికల్ డ్రామా.. ‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్).. కావ్య ఫిలింస్ బ్యానర్‌పై వేణు కున్నప్పిల్లి నిర్మాణంలో, ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిని ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు.
జమోరిన్ పాలనలో చావెరుక్కల్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో డిసెంబర్12న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రం గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదలవుతుంది.కెమెరా : మనోజ్ పిళ్లై, సంగీతం : ఎమ్. జయచంద్రన్, బ్యాగ్రౌండ్ స్కోర్ : సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా, ఎడిటింగ్ : రాజా మొహమ్మద్.