బయటకు రావొద్దు..! హైదరాబాద్‌కు అతి భారీ వర్షాల ముప్పు..!

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. వర్షం కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

బయటకు రావొద్దు..! హైదరాబాద్‌కు అతి భారీ వర్షాల ముప్పు..!

Hyderabad Rains : హైదరాబాద్ లో ఇవాళ కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, జనగాం, మెదక్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. వర్షం కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

అటు నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ దీవులను తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పింది. అది వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అటు జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. జాగ్రత్తగా ఉండాలని నగరవాసులకు సూచించారు. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెప్పారు. గడిచిన కొన్ని రోజులుగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

Also Read : గుడ్‌న్యూస్.. అండమాన్‌ను తాకిన నైరుతి పవనాలు, 22న అల్పపీడనం..!