RRR : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్.. చైనా, జపాన్‌తో సహా మరో 30 దేశాల్లో త్వరలో..
ఆర్ఆర్ఆర్ సినిమాని ఇప్పుడు చైనా, జపాన్ తో సహా మరో ముప్పై దేశాల్లో త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇండియన్ సినిమాలకి చైనా, జపాన్ మంచి మార్కెట్. ఇటీవల ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలు.....
RRR : రాజమౌళి దర్శకత్వంలో చరణ్, తారక్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించి భారీ కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. మన ఇండియన్ సినిమాలకి వేరే దేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా అమెరికా, ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కలెక్ట్ చేయనంతగా వసూళ్లు రాబట్టింది. ఈ రెండు దేశాలే కాక పలు దేశాల్లో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించి వసూళ్లు రాబడుతుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాని ఇప్పుడు చైనా, జపాన్ తో సహా మరో ముప్పై దేశాల్లో త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇండియన్ సినిమాలకి చైనా, జపాన్ మంచి మార్కెట్. ఇటీవల ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలు చైనా, జపాన్ లో భారీ విజయం సాధించాయి. దీంతో ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తో చైనా, జపాన్ దేశాల్లో కూడా మన సినిమాలని రిలీజ్ చేస్తున్నారు.
RRR : ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ డామినేషన్ పై రాజమౌళి వ్యాఖ్యలు
ఇటీవల చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”RRRని ప్రపంచవ్యాప్తంగా మరో 30కి పైగా వివిధ దేశాలలో త్వరలో విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్‌లో జపాన్‌లో విడుదల అవుతుంది. మరోసారి విదేశాల్లో నేను, ఎన్టీఆర్, రాజమౌళి ప్రమోషన్స్ చేయనున్నాము. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సారి దేశాలు చుట్టొస్తాము. RRR గ్లోబల్ థియేట్రికల్ రిలీజ్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాము” అని తెలిపారు.