New Rules: జూలై 1 నుంచి ఆ మూడు విభాగాల్లో కొత్త రూల్స్.. తప్పనిసరిగా పాటించాల్సిందే?

దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, కార్మిక రంగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 01 జులై 2022నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని నిర్ణయించింది. కార్మికుల కోసం కేటాయించిన మొత్తం 29 చట్టాలను కలిపి నాలుగు కోడ్‌లుగా మార్చింది. కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే.. ఉద్యోగుల పని గంటల్లో కూడా మార్పులు వస్తాయి.

New Rules: జూలై 1 నుంచి ఆ మూడు విభాగాల్లో కొత్త రూల్స్.. తప్పనిసరిగా పాటించాల్సిందే?

New Rules

New Rules: దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, కార్మిక రంగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 01 జులై 2022నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని నిర్ణయించింది. కార్మికుల కోసం కేటాయించిన మొత్తం 29 చట్టాలను కలిపి నాలుగు కోడ్‌లుగా మార్చింది. కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే.. ఉద్యోగుల పని గంటల్లో కూడా మార్పులు వస్తాయి. ప్రస్తుతం చాలా సంస్థల్లో 8-9 పని గంటలు ఉండగా అవి 12గంటల వరకు పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ విధానం ద్వారా వారంలో నాలుగు రోజుల మాత్రమే పని ఉంటుంది. మూడు రోజులు కంపెనీలు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది.

New Labour Law

కేంద్ర ప్రభుత్వం జూలై 1నుంచి అమలుచేయబోయే విధానం వల్ల భవిష్య నిధిలో ఎక్కువ మొత్తంలో జమ చేయాల్సి రావడం వల్ల చేతికి అందాల్సిన మొత్తం తగ్గుతుంది. గ్రాస్‌ శాలరీలో 50 శాతం మేర పీఎఫ్‌లో జమ చేయాల్సి వస్తుంది. ఆర్జిత సెలవులు(ఈఎల్‌) పొందే అర్హతను 240 పనిదినాల నుంచి 180 రోజులకు తగ్గించారు. ఉద్యోగంలో కొత్తగా చేరిన వారికి 240 రోజుల పనిచేసిన తర్వాతనే ఈఎల్స్‌ లభించేవి. దాన్ని 180 రోజులకు కుదించారు. ఇప్పటివరకు 23 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే ఈ చట్టాలపై ముసాయిదా నిబంధనలను రూపొందించాయి.

Credit Cards

క్రెడిట్, డెబిట్ కార్డ్‌లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు మార్పులు చేసింది. క్రెడిట్ కార్డ్‌ల రద్దు, బిల్లింగ్‌కు సంబంధించిన నిబంధనలను సవరించింది. ఈ క్రెడిట్ కార్డ్ నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయని సెంట్రల్ బ్యాంక్ నోటిఫికేషన్‌లో తెలిపింది. అయితే.. తాజా నిబంధనలు షెడ్యూల్డ్ బ్యాంక్‌కు, (NBFC) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (పేమెంట్ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మినహా) వర్తిస్తాయి. కొత్త రూల్స్ ప్రకారం.. వినియోగదారుడి ప్రమేయం లేకుండా బ్యాంకులు కొత్త క్రెడిట్‌ కార్డులు ఇచ్చినా, అప్‌గ్రేడ్‌ చేసినా, ఆ తర్వాత దానికి సంబంధించి బిల్లులు వేసినా ఆ మొత్తాన్ని కార్డు ఇచ్చిన సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బిల్లు మొత్తానికి రెట్టింపు జరిమానా విధిస్తారు. వినియోగదారుడి వద్ద ఉన్న క్రెడిట్‌ కార్డును వద్దనుకుంటే.. ఈ విషయంలో కంపెనీకి ఫిర్యాదు చేస్తే ఏడు రోజుల్లోగా ఆ కార్డును బ్లాక్‌ చేయాలి. లేదంటే అప్పటి నుంచి ప్రతి రోజూ సంస్థ రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Single Use Plastic

దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రం నిషేధం విధించింది. జూలై 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దీంతో వీటి తయారీ, పంపిణీ, దిగుమతి, అమ్మకంపైనా నిషేధం ఉంటుంది. బెలూన్‌ పుల్లలు, సిగరెట్‌ ప్యాకెట్లు, డిస్పోజబుల్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఇయర్‌ బడ్స్‌, ఐస్‌క్రీం పుల్లలు, పీవీసీ బ్యానర్లు మరికొన్ని నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇలా జూలై 01 నుంచి కేంద్ర ప్రభుత్వం మూడు విభాగాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.