Sam Northeast : క్రికెట్లో మరో సెన్సేషన్.. ఆ ఒక్కడే 410 పరుగులు బాదాడు
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరుదైన రికార్డ్ నమోదైంది. ఇంగ్లండ్ లోని గ్లామోర్గాన్ జట్టు ఆటగాడు సామ్ నార్త్ ఈస్ట్ లీస్టర్ షైర్ తో మ్యాచ్ లో 450 బంతుల్లో 410 పరుగులు చేశాడు. 400లకు పైగా పరుగులు బాదడమే కాదు నాటౌట్ గా నిలిచి వారెవ్వా అనిపించాడు.
Sam Northeast : జెంటిల్మెన్ గేమ్ గా పిలవబడే క్రికెట్ లో ప్లేయర్లు ఎన్నో రికార్డులు నెలకొల్పారు. మరెన్నో రికార్డులు బద్దలయ్యాయి. కొన్ని రికార్డులు ఊహకు కూడా అందని రేంజ్ లో ఉన్నాయి. అలాంటి ఒక రికార్డ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నమోదైంది. వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా ఓ క్రికెటర్ 400 పరుగులు బాదాడు. ఏంటి షాక్ అయ్యారా? అవును.. నిజం..
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరుదైన రికార్డ్ నమోదైంది. ఇంగ్లండ్ లోని గ్లామోర్గాన్ జట్టు ఆటగాడు సామ్ నార్త్ ఈస్ట్ లీస్టర్ షైర్ తో మ్యాచ్ లో 450 బంతుల్లో 410 పరుగులు చేశాడు. 400లకు పైగా పరుగులు బాదడమే కాదు నాటౌట్ గా నిలిచి వారెవ్వా అనిపించాడు. అతడి స్కోర్ లో 45 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక స్కోర్ చేసిన టాప్ 10 ఆటగాళ్ల జాబితాలో సామ్ చేరాడు. తొలి స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఉన్నాడు. 1994లో వార్విక్ షైర్ తరఫున లారా 501 రన్స్ చేశాడు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
సామ్ పరుగుల వరద పారించిన ఈ మ్యాచ్ లో గ్లామోర్గాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 795 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కౌంటీ చర్రితలో ఇదే అత్యధిక స్కోర్. గ్లామోర్గాన్ జట్టు 6.1 ఓవర్లలో 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాలో ఉంది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సామ్.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో నిలదొక్కుకుని పరుగుల వరద పారించాడు. గ్లామోర్గాన్ జట్టులో 400 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా నార్త్ సామ్ ఈస్ట్ రికార్డ్ నెలకొల్పాడు.
Rishabh Pant: రిషబ్ పంత్ బరువు తగ్గాలి: షోయబ్ అఖ్తర్
విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 2004లో ఇంగ్లండ్ పై 400 పరుగులు చేశాడు. ఆంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో లారా ఈ ఘనత సాధించాడు. లారా చెలరేగడంతో విండీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 715 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ 285 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఫాలో ఆన్ ఆడింది. కానీ, ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది.
???? ???????!
Sam Northeast becomes the first Glamorgan player ever to reach 4⃣0⃣0⃣ ?
???????????. It also brings up the 450 partnership! ?
????? ????: https://t.co/F3GGp6mm3i#LEIvGLAM | #GoGlam pic.twitter.com/DFrFk15QUW
— Glamorgan Cricket ? (@GlamCricket) July 23, 2022