బ్రేకింగ్ : మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిని రద్దు చేస్తూ సోమవారం(జనవరి 27,2020) జగన్ తీర్మానం ప్రవేశ

  • Published By: veegamteam ,Published On : January 27, 2020 / 12:14 PM IST
బ్రేకింగ్ : మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిని రద్దు చేస్తూ సోమవారం(జనవరి 27,2020) జగన్ తీర్మానం ప్రవేశ

ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిని రద్దు చేస్తూ సోమవారం(జనవరి 27,2020) జగన్ తీర్మానం ప్రవేశ పెట్టారు. మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఉన్న వారు లేచి నిల్చోవాలని స్పీకర్ చెప్పారు. 

133 మంది సభ్యులు తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. వ్యతిరేకంగా కానీ తటస్థంగా కానీ ఒక్క ఓటు కూడా పడలేదు. మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. కాగా, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఆర్టికల్ 169-1 ప్రకారం మండలిని రద్దు చేస్తూ సభ తీర్మానం చేసింది. మండలిని రద్దు చేయాలన్న సీఎం జగన్ తీర్మానానికి అనుకూలంగా 133 మంది సభ్యులు ఓటేశారు. మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో సభ ఆమోదం తెలిపడంతో మండలి రద్దు తీర్మానం శాసన సభ ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను నివరవధికంగా వాయిదా వేశారు.

కాగా, ఇవాళ్టి సమావేశానికి టీడీపీ సభ్యులు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు మాట్లాడిన జగన్.. శాసన మండలి ఎందుకు రద్దు చేస్తున్నామో సభలో వివరించారు. అసెంబ్లీ ఆమోదించిన కీలక బిల్లులను రాజకీయ కోణంలో అడ్డుకోవడానికి మాత్రమే మండలి పనిచేస్తోందని జగన్ ఆరోపించారు. మండలి మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అన్నారు. మండలిని కొనసాగిస్తే త్వరలో మా పార్టీకి అధిక స్థానాలు వస్తాయని అందరికి తెలుసు.. కానీ రాజకీయ కోణంలో కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ ప్రకటించారు.

కీలక బిల్లులు ఆమోదం పొందకుండా రాజకీయ కోణంలో మండలిలో అడ్డుకున్నారని.. ఇలాంటి మండలి అవసరమా? అని జగన్ ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగం లేని మండలి రద్దు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. సోమవారం ఉదయం నుంచి శాసనసభలో మండలి రద్దు తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది.

ఏపీ రాజకీయాల్లో అంతా ఊహించనట్లుగానే మండలిని ఏపీ సర్కార్‌ రద్దు చేసింది. దీంతో.. ఏపీ చరిత్రలో మండలి రెండు సార్లు రద్దు అయినట్లు అయ్యింది. గతంలో.. 1985లో ఎన్టీఆర్‌ ఒకసారి మండలిని రద్దు చేశారు. దీనికి అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. సోమవారం(జనవరి 27,2020) శాసన మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానంపై ఆరు గంటలకుపైగా చర్చ జరిగింది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 133 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌ తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. ప్రజలకు మంచి చేసే నిర్ణయాల అమలు జాప్యం కాకూడదన్న ఉద్దేశంతోనే మండలి రద్దు తీర్మానం తెచ్చామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. మండలిలో అన్నీ రాజకీయ కోణంలో చూశారని ఆరోపించారు.

నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న రోజుల్లో ప్రత్యేక మండలిని ఏర్పాటు చేశారని ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. ప్రస్తుతం శాసనసభలో మేధావులు, విద్యావంతులు ఉన్నారని.. కాబట్టి ప్రత్యేకంగా మండలి అవసరం లేదన్నారు. దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లోనే శాసన మండలి ఉందన్న ఆయన… గతంలో పలు రాష్ట్రాలు మండలిని ఉపసంహరించుకున్నాయని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక భారంగా మారిన మండలి రద్దే సరైన నిర్ణయమని మరోసారి స్పష్టం చేశారు.

* మండలికి మంగళం
* ఏపీ శాసన మండలి రద్దు
* శానస మండలి రద్దు తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
* డివిజన్ ఓటింగ్ నిర్వహించిన స్పీకర్
* అనుకూలంగా 133 మంది సభ్యులు ఓటు
* జనసేన ఏకైక ఎమ్మెల్యే సైతం మద్దతు

అసెంబ్లీలో సీఎం జగన్ కామెంట్స్:
* రాజకీయ కోణంతోనే మండలిలో బిల్లులు అడ్డుకుంటున్నారు
* ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేని మండలి అవసరమే లేదు
* ప్రజా ప్రయోజనాల కోసమే మండలి రద్దు నిర్ణయం
* మండలి అవసరమే అయితే కచ్చితంగా ఉంచేలా రాజ్యాంగంలో పెట్టేవారు

* చంద్రబాబులా నేను ఆలోచిస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా మిగలదు
* ఇది మండలి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాదు
* ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా..వద్దా అన్నది ప్రశ్న
* మండలిపై డబ్బు ఖర్చు చేయడం దండగ

* దేశంలో 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి
* ఎస్సీ, ఎస్టీ కమిషన్.. ఇంగ్లీష్ మీడియం బిల్లులనే కాదు.. చివరికి కోట్ల మంది ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లును కూడా మండలిలో అడ్డుకున్నారు
* మంచి కోసం చేసే నిర్ణయాలు కుట్రల వల్ల ఆసల్యం కాకూడదు
* అందరికీ న్యాయం చేయాలనుకోవడం తప్పా..?

* రైతులకు గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వడం న్యాయమా? అన్యాయమా?
* చంద్రబాబుకి ఏ విషయంలోనూ స్థిరత్వం లేదు
* అవసరమైతే పిల్లనిచ్చిన మామను పొడవడానికి కూడా వెనుకాడడు
* రాజకీయ కోణంలో మండలిలో బిల్లులను ఆలస్యం చేస్తున్నారు    
* ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకున్నారు
* ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు ఆలస్యం కాకూడదనే మండలి రద్దు
* అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాజకీయ కోణంలో అడ్డుకోవడానికి మాత్రమే మండలి పనిచేస్తోంది