Plane Crash : వీడెవడండీ బాబూ.. ఏకంగా విమానాన్నే దొంగలించాడు.. కూల్చేస్తానంటూ చుక్కలు చూపించాడు
అమెరికాలోని మిసిసిపిలో ఓ ప్రబుద్దుడు ఏకంగా విమానాన్నే దొంగలించాడు. దొంగలించిన విమానంతో కలకలం రేపాడు. చివరికి పోలీసులు ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Plane Crash : అమెరికాలోని మిసిసిపిలో ఓ ప్రబుద్దుడు ఏకంగా విమానాన్నే దొంగలించాడు. దొంగలించిన విమానంతో కలకలం రేపాడు. చివరికి పోలీసులు ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 29ఏళ్ల యువకుడు 9 సీటర్ విమానాన్ని దొంగిలించాడు. దాంతో వాల్ మార్ట్ స్టోర్ కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. వాల్ మార్ట్ స్టోర్ భవనంపైనే చాలా సేపు విమానంతో చక్కర్లు కొట్టాడు.
దీంతో అప్రమత్తమైన అధికారులు వాల్ మార్ట్ ను ఖాళీ చేయించారు. సుమారు గంటపాటు ఆకాశంలో చక్కర్లు కొట్టిన యువకుడు చివరకు విమానాన్ని కిందకు దింపడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకోసం విమానాన్ని చోరీ చేశాడు? వాల్ మార్ట్ ను కూల్చేస్తానని ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
విమానం దొంగలించి చుక్కలు చూపించాడు..
BREAKING: Pilot threatening to crash plane into Walmart in Tupelo, Mississippi, police say pic.twitter.com/znMlDj5M2N
— BNO News (@BNONews) September 3, 2022