Sardar: కార్తి సర్దార్ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్, టీజర్లను ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Sardar: తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
Sardar: హీరో కార్తీ షాకింగ్ లుక్.. గుర్తు పట్టడం కూడా కష్టమే!
ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్, టీజర్లను ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. త్వరలోనే ఈ రెండింటిని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమాలో కార్తి రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా, అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు జివి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. దీపావళి కానుకగా రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Sardar : ‘సర్దార్’ గా కార్తి.. వీడియో చూశారా!..
ఇక ఈ సినిమాలో కార్తి సరసన అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. సిమ్రాన్, రజిషా విజయన్, మునీష్ కాంత్, చంకీ పాండే, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో కార్తి తన కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ సినిమా ఫస్ట్ సింగిల్, టీజర్లకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
Dropping the #FirstSingle soon!
Get ready for #SardarDeepavali !!#Sardar releasing this #Deepavali!!@Karthi_Offl @Prince_Pictures @AnnapurnaStdios@gvprakash@RaashiiKhanna_ @lakku76 @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction pic.twitter.com/hS6WS1beQI— PS Mithran (@Psmithran) September 15, 2022