Renu Desai: రవితేజకు బూస్ట్ ఇచ్చే పాత్రలో రేణు దేశాయ్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న పీరియాడిక్ బయోపిక్ మూవీ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రవితేజ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Renu Desai: రవితేజకు బూస్ట్ ఇచ్చే పాత్రలో రేణు దేశాయ్

Buzz On Renu Desai Role In Raviteja Tiger Nageshwar Rao Movie

Renu Desai: మాస్ రాజా రవితేజ నటిస్తున్న పీరియాడిక్ బయోపిక్ మూవీ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రవితేజ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Renu Desai: హేమలతా లవణం పాత్రలో రేణు దేశాయ్ రీఎంట్రీ అదిరిందిగా!

ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటిస్తున్నట్లు ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా వెల్లడించింది చిత్ర యూనిట్. ఇక ఈ పాత్ర సినిమాలో రవితేజ పాత్రను ప్రభావితం చేసే పాత్రగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Renu Desai : జీవితంలో ఒక తోడు కావాలి.. రేణు దేశాయ్ స్పెషల్ పోస్ట్.. రెండో పెళ్లి..?

రవితేజ పాత్రకు స్పూర్తిని కలిగించే పాత్రలో రేణు దేశాయ్ పర్ఫార్మెన్స్ సూపర్బ్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తానికి ఈ సినిమాలో రేణు దేశాయ్ పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్పడంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.