2024 Elections: 80 సీట్లూ మావే.. కాదు కాదు మావే.. బీజేపీ, ఎస్పీ పోటాపోటీ ప్రకటనలు

2014 అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాలున్న యూపీలో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకుంది. కాగా ఎస్పీ ఐదు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ రెండు స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 20 శాతం ఓట్ బ్యాంక్ సాధించినప్పటికీ బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది

2024 Elections: 80 సీట్లూ మావే.. కాదు కాదు మావే.. బీజేపీ, ఎస్పీ పోటాపోటీ ప్రకటనలు

All 80 Seats in UP is ours.. BJP and SP claims

2024 Elections: లోక్‭సభ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇప్పటి నుంచే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే వచ్చే ఎన్నికలపై కొన్ని విశ్వాసాలు సైతం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా 80 లోక్‭సభ స్థానాలు ఉంటాయి. అయితే అన్నింటిని అన్ని సీట్లు తామే గెలుస్తామని ఇటు భారతీయ జనతా పార్టీ, అటు సమాజ్‭వాదీ పార్టీ పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి.

UP IPS: రూ.20 లక్షలు లంచం తీసుకున్న ఐపీఎస్ అధికారి.. గంటల వ్యవధిలోనే విచారణ ప్రారంభించిన ప్రభుత్వం

ఈ విషయమై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్వామి ప్రసాద్ మౌర్య స్పందిస్తూ ‘‘వచ్చే ఎన్నికల్లో 80 పార్లమెంటు స్థానాలు బీజేపీనే గెలుస్తుంది. రాష్ట్రంతో పాటు దేశంలో మొత్తంగా 400 స్థానాలు గెలుస్తాం. అత్యంత ఘనమైన మెజారిటీతో అధికారంలోకి వస్తాం’’ అని అన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట అన్నారు. రెండుసార్లు తాము అధికారంలోకి వచ్చింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజారిటీ సాధించేనని, అయితే 2019లో కాస్త మెజారిటీ తగ్గినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఉన్న సీట్లన్నీ తామే గెలుస్తామని మౌర్య ధీమా వ్యక్తం చేశారు.

#BudgetSession2023: అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంటులో హంగామా

ఇక దీనికి రెండు రోజుల ముందు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ సైతం అటుఇటుగా ఇవే వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి (సమాజ్‭వాదీ పార్టీ+రాష్ట్రీయ లోక్‭దళ్) రాష్ట్రంలోని 80 సీట్లనూ గెలుస్తుందని అన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన మోయిన్ పురి ఉప ఎన్నికలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఇది ములాయం స్థానం. అయితే ఆయన మరణం అనంతరం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎస్పీ+ఆర్ఎల్డీ కూటమి 80 స్థానాల్లో పోటీ చేయనుందని, తమ కూటమే సీట్లన్నీ గెలుచుకుంటుందని అఖిలేష్ అన్నారు.

Uttarakhand : 30 సెకన్లలో హత్య కేసు నిందితుడికి పట్టించిన శునకానికి ‘బెస్ట్‌ ఎంప్లాయీ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు

2014 అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాలున్న యూపీలో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకుంది. కాగా ఎస్పీ ఐదు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ రెండు స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 20 శాతం ఓట్ బ్యాంక్ సాధించినప్పటికీ బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ కాస్త తగ్గినప్పటికీ సింహభాగం సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీకి 62 స్థానాలు దక్కాయి. గత ఎన్నికల అనుభవంతో ఈ ఎన్నికల్లో బీఎస్పీ-ఎస్పీ పొత్తులో వెళ్లినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. బీఎస్పీ 10 స్థానాలు గెలుచుకోగా, ఎస్పీ మరోసారి అదే ఐదు స్థానాలకు పరిమతమైంది. ఇక ఈసారి రాహుల్ తన కంచుకోట అమేథిలో ఓడారు. ఈసారి కాంగ్రెస్ ఒక స్థానానికే పరిమితమైంది. మరి రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.