రైల్వే స్టేషన్లలో మొబైల్ థియేటర్స్ : కాచిగూడలో 5 ఆటలు

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 06:16 AM IST
రైల్వే స్టేషన్లలో మొబైల్ థియేటర్స్ : కాచిగూడలో 5 ఆటలు

కాచిగూడ :  రైల్వే ప్రయాణీకులకు బోర్ కొట్టకుండా రైల్వే శాఖ ఓ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది. అదే మొబైల్ థియేటర్స్. ప్యాసింజెర్స్ కు బోర్ కొట్టకుండా రైల్వే సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. సెలెక్టడ్ స్టేషన్స్ లో  స్టేషన్లలో మొబైల్ థియేటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికి కాచిగూడ రైల్వే స్టేషన్ వేదికగా నిలిచింది. హైదరాబాద్‌లోని కాచిగూడలో  రైల్వే శాఖ ప్రవేశ పెట్టిన మొబైల్ థియేటర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 
చాలామంది రైలు ప్రయాణాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే సౌకర్యంగా, ఆహ్లాదంగా ప్రయాణం సాగించడానికి రైల్ ప్రయాణం మంచిగా వుంటుంది. దీంతో మారుతున్న కాలంతో పాటు ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి భారతీయ రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.  రైలు ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉన్నా.. ఎక్కాల్సిన రైలు లేట్ కావటం కామన్ గా మారుతున్న క్రమంలో ప్యాసింజర్స్ ఎక్కువ టైమ్ వెయిటింగ్ తోనే గడిచిపోతోంది. పైగా దూర ప్రయాణాల్లో విషయంలో ఒక రైలు నుంచి మరో రైలుకు మారేటప్పుడు గంటలకొద్దీ సమయం వేచి చూడాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రయాణికులకు బోర్ కొట్టకుండా వుండేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే కాచిగూడ నుండి మొబైల్ థియేటర్స్ కు శ్రీకారం చుట్టింది. రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులకు సంతోషాన్ని పంచడంతో పాటు స్వచ్ఛభారత్‌పై అవగాహన కలిగించడం ఈ మొబైల్ థియేటర్ ఉద్దేశం. 

కాచిగూడ స్టేషన్ లోని స్పెషల్  స్క్రీన్‌పై రెండు తెలుగు, రెండు హిందీ భాషలలోని సినిమాలను రోజూ 5 షోలు వేస్తున్నారు. వీటితో పాటు వివిధ భాషలో మెసేజ్ ఓరియంటెండ్ సినిమాలను కూడా ప్రదర్శిస్తున్నారు. థియేర్ నుంచి సౌండ్ బయటకు రాకుండా రైల్వే శాఖ  ప్రత్యేక ఏర్పాట్ల కూడా చేశారు. ఈ మొబైల్ థియేటర్స్ అన్ని స్టేషన్లకు విస్తరిస్తే..రైల్వే ప్యాసింజర్స్ కు బోర్ కొట్టే పనేలేదన్నమాట..కానీ ఇక్కడో చిక్కుందండోయ్..సినిమా ధ్యాసలో పడి ఎక్కాల్సిన రైల్ మిస్ అవ్వొచ్చు..మరి మొబైల్ థియేటర్స్ ను ఎంజాయ్ చేస్తునే..ట్రైన్ మిస్ అవ్వకుండా క్యాచ్ చేసేయండి..