Road Accident : షాకింగ్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం, రోడ్డుపై కారు బీభత్సం
Road Accident : రోడ్డుపై వేగంగా వెళ్తున్న నల్ల రంగు SUV కారు అదుపు తప్పింది. అంతే.. ఎదురుగా వస్తున్న ఒక కారుని(వ్యాగనార్), రెండు స్కూటర్లను బలంగా ఢీకొట్టింది.
Road Accident : రోడ్డు పై వెళ్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. మితిమీరిన వేగం అత్యంత ప్రమాదకరం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని అంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదం. మన ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలు కూడా పోతాయి. అందుకే, రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.
అయితే, కొందరు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. వాళ్లు చేసే తప్పుకి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కేరళలో ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పింది. ఓ కారుని, రెండు స్కూటర్లను ఢీకొట్టి షాపులోకి దూసుకెళ్లింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేరళలోని పతనంతిట్ట పరిధి కురంబాల సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న నల్ల రంగు SUV కారు అదుపు తప్పింది. అంతే.. ఎదురుగా వస్తున్న ఒక కారుని(వ్యాగనార్), రెండు స్కూటర్లను బలంగా ఢీకొట్టింది. తర్వాత రోడ్డు పక్కనే ఉన్న షాపులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. డ్రైవర్ కారు మీద కంట్రోల్ కోల్పోయాడు. దాంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Two People Injured After A Jeep Crashed Into A Shop Near Kurambala In Kerala.#TNShorts #Kerala pic.twitter.com/FANxo69M4W
— TIMES NOW (@TimesNow) May 2, 2023