కోహ్లీ ఆర్సీబీ జట్టు ఇంటికి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పటికీ ఛాన్స్ ఉంది.. ఎలాగో తెలుసా?

IPL 2024: చెన్నై సూపర్ కింగ్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో ఆ జట్టు ఒక్క మ్యాచు ఓడిపోతే ఆర్సీబీ ప్లేఆఫ్‌లోకి..

కోహ్లీ ఆర్సీబీ జట్టు ఇంటికి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పటికీ ఛాన్స్ ఉంది.. ఎలాగో తెలుసా?

Virat Kohli

Updated On : May 11, 2024 / 8:52 PM IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాలామందికి పేవరెట్ జట్టు. కోహ్లీ, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఐపీఎల్ 2024లో వెనకబడి పోతోంది. ప్రస్తుత ఐపీఎల్‌లో మొత్తం 12 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 5 మ్యాచుల్లో గెలిచి, ఏడింటిలో ఓడిపోయింది. దీంతో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. అయినప్పటికీ, ఇప్పటికీ ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు చేరే అవకాశం ఉంది.

అయితే, అందుకు అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వరుసగా కోల్‌కతా నైట్ రైడర్స్ (16 పాయింట్లు), రాజస్థాన్ రాయల్స్ (16), సన్‌రైజర్స్ హైదరాబాద్ (14), చెన్నై సూపర్ కింగ్స్(12), ఢిల్లీ క్యాపిటల్స్ (12), లక్నో సూపర్ జెయింట్స్ (12) తొలి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఆరు జట్ల తర్వాత ఆర్సీబీ (10 పాయింట్లు) ఉంది.

ఆర్సీబీ గెలవాలంటే వీటిలో ఒకటి జరగాలి..

  • ఆర్సీబీ మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచులో ఓడిపోయినా ప్లేఆఫ్స్ చేరుకోలేదు. ఐపీఎల్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, లక్నోతోనే బెంగళూరు ప్రధానంగా పోటీ పడాల్సి ఉంది.
  • చెన్నై సూపర్ కింగ్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో ఆ జట్టు ఒక్క మ్యాచు ఓడిపోతే ఆర్సీబీ ప్లేఆఫ్ లోకి వెళ్లే అవకాశాలు కాస్త ఉంటాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. చెన్నై ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. బెంగళూరు జట్టుతో ఆడే ముందు రాజస్థాన్ రాయల్‌తో చెన్నై ఆడాల్సి ఉంది. ఫ్లేఆఫ్స్ లో చేరాలంటే సీఎస్కే బలం ఆ జట్టు రన్ రేటే. ప్రస్తుతం చెన్నై రన్ రేట్ +0.491గా ఉంది. చెన్నై జట్టు భారీ తేడాతో ఓడితే ఆర్సీబీకి కలిసి వస్తుంది.
  • ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో ఉన్న మరో జట్టు లక్నో సూపర్ జెయింట్స్. ఇప్పటివరకు మొత్తం 12 మ్యాచ్‌లు ఆడి 6 గెలిచి ఇప్పటికే 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 2 లీగ్ గేమ్‌లు ఆడాల్సి ఉంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించాలంటే ఒక మ్యాచ్‌లోనైనా లక్నో ఓడిపోవాలి. ఒకవేళ రెండు గేమ్‌లను లక్నో గెలిస్తే, 16 పాయింట్లు వస్తాయి. అలా జరిగితే ఆర్సీబీ ప్లేఆఫ్ లోకి చేరుకోలేదు.
  • ప్లేఆఫ్స్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉంది. ఆ జట్టు 12 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో కనీసం ఒకదాంట్లో ఓడితే ఆర్సీబీకి ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉంటాయి. అయితే, ఇదే సమయంలో ఢిల్లీ, లక్నోకి కూడా ప్లేఆఫ్స్ కి ఛాన్సులు ఉంటాయి.
  • ప్రస్తుతం హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ +0.406గా ఉంది. బెంగళూరు నెట్ రన్ రేట్ +0.217గా ఉంది. హైదరాబాద్ జట్టు రెండు మ్యాచుల్లోనూ ఓడి, రన్ రేట్ కూడా తగ్గితే ఆర్సీబీకి ప్లేఆఫ్స్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడు లేదా నాలుగో స్థానానికి వెళ్తుంది.

Also Read: కీలక మ్యాచ్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ.. ఒక్క మ్యాచుకు దూరంగా కెప్టెన్ రిషబ్ పంత్‌