ఇంటి వద్దనే సీబీఎస్ఈ పరీక్షా పేపర్ల మూల్యాంకనం

  • Published By: vamsi ,Published On : May 9, 2020 / 03:50 PM IST
ఇంటి వద్దనే సీబీఎస్ఈ పరీక్షా పేపర్ల మూల్యాంకనం

సీబిఎస్‌ఈ బోర్డు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని రేపటి(మే 10వ తేదీ) నుంచి తిరిగి ప్రారంభిస్తామని హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ ప్రకటించారు. బోర్డు ఎగ్జామినర్స్ ఇళ్లకు సుమారు 11.5 కోట్ల జవాబు పత్రాలు అందజేస్తామని తద్వారా వారు లాక్డౌన్లో పని చేయవచ్చునని వెల్లడించారు.

బిఎస్‌ఈ పేపర్ మూల్యాంకనం రేపు, మే 10 నుండి తిరిగి ప్రారంభమవుతుందని, సీబిఎస్‌ఈ బోర్డు పరీక్షకులు తమ ఇళ్ల నుంచి సిబిఎస్‌ఈ బోర్డు పరీక్షా జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తారని ఆయన చెప్పారు.

భారతదేశంలోని 3000 పరీక్షా కేంద్రాల నుంచి సుమారు 1.5 కోట్ల సిబిఎస్‌ఈ బోర్డు పరీక్షా జవాబు పత్రాలను తనిఖీ చేసే ప్రక్రియను నిర్వహించే బోర్డు ఇళ్లకు అందజేస్తామని చెప్పారు. పేపర్ మూల్యాంకనం పూర్తయిన తర్వాత, అధికారులు వచ్చి జవాబు పత్రాలను సేకరించి వాటిని బోర్డు పరీక్షా కేంద్రాలకు తీసుకుని వెళతారు.

కరోనా మహమ్మారి దెబ్బకు సామాజిక జీవనం కుదేలవగా.. దేశంలో విద్యావ్యవస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యార్థులు ఇంటికే పరిమితం కాగా కొన్ని విద్యాసంస్థలు ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రక్రియ మొత్తం 50 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించామని, 2020 సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్ ఫలితాలు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉండదని మంత్రి స్పష్టం చేశారు.విద్యార్థులు వీలైనంత త్వరగా సిబిఎస్‌ఈ బోర్డు పరీక్షా  2020 ఫలితాలను పొందగలిగేలా లాక్‌డౌన్‌లో ఈ అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.