ఎకానమీ ప్యాకేజీని అలా తీసుకొచ్చారు!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. అసలు ఆ మొత్తం ప్రభుత్వంపై ఎంత భారం వేస్తుంది. ప్రజలకు ఎంతవరకూ మేలు చేకూరనుంది.. తెలుసుకుందాం..
ప్రధాని మోడీ ప్రకటించిన మొత్తం పెద్ద మొత్తంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వ లెక్కల్లో నుంచి నిధులు కేటాయించింది చాలా తక్కువ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లో అదనపు లిక్విడిటీ కింద అదే రూ.8.04లక్షల కోట్లు ఇచ్చింది. దీంతో పాటుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 27న ఫిస్కల్ ప్యాకేజీ కింద రూ.1.7లక్షల కోట్లు ప్రకటించారు. ఎకానమీ ప్యాకేజీలో భాగంగా ఇంకా రూ.10.26లక్షల కోట్ల వివరాలు తెలియాలి.
ఆర్థిక మంత్రి మీడియా సమావేశంలో వాటి వివరాలు తెలియజేస్తారని అంతా అనుకుంటున్నారు. ‘మే 9న బడ్జెట్ 2020-21లో భాగంగా మార్కెట్ అవసరాల కోసం గవర్నమెంట్ రూ.12లక్షల కోట్ల నుంచి రూ.7.8లక్షల కోట్లు ప్రకటించింది. దీని ప్రకారం చూస్తే GDPలో 2.1శాతం ఫిస్కల్ ప్యాకేజీగా ప్రకటించారు. అంటే రూ.4.2లక్షల కోట్లు మాత్రమే.
మరోవైపు ప్రభుత్వం పేదలకు సాయం చేసేందుకు, వలస కార్మికుల కోసం రూ.4.2లక్షల కోట్లు మాత్రమే కేటాయించాలని అనుకుని ఉండొచ్చు. ఇండియన్ ఎకానమీ 47రోజులుగా నష్టపోతున్న సమయంలో ఈ ప్యాకేజీ పూర్తి సంవత్సరంపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ సర్వీసులు, రీసెర్చర్లు ఇండియన్ ఎకానమీ 2020-21 నాటికి 0.4శాతం పడిపోతుందని చెప్తున్నారు.
కొన్ని వర్గాల సమాచారం మేరకు నగదు లావాదేవీలు అనేవి నేరుగా అవసరం ఉన్నవారికి జరిగితేనే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. నిర్ధిష్టమైన సెక్టార్లకు చెందిన కంపెనీల్లో 10శాతం నష్టాలు చవిచూసినట్లు ప్రభుత్వం అంగీకరిస్తేనే ఇది సాధ్యమవుతోంది. కొన్ని బ్యాంకులకు మాత్రం అప్పులు ఎక్కువగా ఇవ్వాలి. ప్రస్తుతమున్న సమస్య బ్యాంకు క్రెడిట్ లిమిట్ ను పెంచుతుంటూ ఉండటమే.
మంగళవారం మోడీ మాట్లాడుతూ.. MSME ప్యాకేజీ గురించి ప్రస్తావంచారు. దానిపై మాట్లాడిన MSME మినిస్టర్ నితిన్ గడ్కరీ.. ప్రభుత్వం బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌ల ద్వారా లక్ష కోట్ల రూపాయలను రివాల్వింగ్ ఫండ్లుగా కేటాయించారు. అంత పెద్దగా కనిపించే ఎకానమీ ప్యాకేజీ విడదీస్తే మాత్రం కేవలం వేల కోట్లు మాత్రమే.
మార్చి 27న ప్రకటించిన తొలి ఫిస్కల్ ప్యాకేజీ కింద రూ.61వేల 380కోట్లు వచ్చే 3నెలలకు కేటాయించారు. మహిళా జన్ ధన్ అకౌంట్ హోల్డర్లకు రూ. రూ.10వేల కోట్లు కేటాయించారు. వితంతువులు, పెద్దవారు, వికలాంగుల కోసం రూ.3వేల కోట్లు, రైతులకు రూ.17వేల 380కోట్లు, భవన నిర్మాణ కార్మికులకు రూ.31వేల కోట్లను వెల్ఫేర్ ఫండ్ తరపున విడుదల చేశారు.
Read More:
* కరోనా సాయం.. 20లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలు ప్రకటించనున్న నిర్మలా సీతారామన్
* మోడీ హెడ్‌లైన్ పెట్టారు.. సీతారామన్ పూర్తి చేస్తారు: చిదంబరం