ఇకపై కరోనా టెస్టు ఎంతో చౌక.. గంటకే రిజిల్ట్..!

  • Published By: srihari ,Published On : May 14, 2020 / 02:19 AM IST
ఇకపై కరోనా టెస్టు ఎంతో చౌక.. గంటకే రిజిల్ట్..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ వేగంగా పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు ఆగడం లేదు. కరోనా బాధితులను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలకు ఆలస్యం అవుతోంది. కరోనా పరీక్షలకు సంబంధించి ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో కేసుల సంఖ్య కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కరోనా కేసులను గుర్తించి వ్యాప్తిని అరికట్టడంలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కానీ, కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా టెస్టులకు అయ్యే ఖర్చు కూడా భారీగా ఉండటంతో అందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలంటే కష్టంతో కూడుకున్న పని. కరోనా టెస్టుల ఫలితాలు మరింత జాప్యమవుతోంది. ఇకపై ఈ పరిస్థితి ఉండబోదు. 

ఎందుకంటే.. చౌకైన ధరకే కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. కేవలం గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలను అందిస్తాయి. దేశంలో మరో నాలుగు వారాల్లో ఈ కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఫెలూదా అనే ఈ టెస్టింగ్ పాలసీలో కొవిడ్-19ను నిర్ధారించేందుకు సుమారు రూ.500 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ విధానాన్ని ఢిల్లీలోని కౌన్పిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (CSIR-IGRB)లో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ దేబొజ్యోతి చక్రవర్తి, డాక్టర్ సౌవిక్ మైతీ  ఈ టెస్టు కిట్లను కనిపెట్టారు.

ఫెలూదా విధానంలో కొవిడ్-19 వ్యాధి కారకమైన SARS-COV2 వైరస్ జన్యు నిర్మాణాన్ని గుర్తించి నిర్మూలించేందుకు CRI SPR GN ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దేశంలో కరోనా పరీక్షా విధానానికి ఈ తరహా టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు టాటా సన్స్ సంస్థకు అనుమతి లభించింది. ఈ కరోనా పరీక్షా విధానం పూర్తి పేరు – FNCAS9 ఎడిటర్ లింక్డ్ యూనిఫార్మ్ డిటెక్షన్ అస్సే… సింపుల్‌గా ‘ఫెలూదా’ అని పిలుస్తున్నారు.

ప్రముఖ భారతీయ దర్శకుడు సత్యజిత్ రే సృష్టించిన కల్పిత డిటెక్టివ్ పాత్ర పేరు ఫెలూదా. కొవిడ్ నిర్ధారణకు ఇప్పటివరకు ఉపయోగిస్తున్న విధానాల్లో ల్యాబరేటరీ తప్పనిసరి. కేవలం ఓ పేపర్ స్ట్రిప్‌ను ఉపయోగించే ఫెలూదా విధానంలో ల్యాబ్ అవసరం ఉండదు. వ్యాధి పరీక్షలు నిర్వహించే ఏ సాధారణ ల్యాబ్ అయినా కొంచెం ట్రైనింగ్ ద్వారా సులువుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. టెస్టు ఫలితాలు చాలా కచ్చితంగా ఉంటాయని CSIR డైరక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. 

Read Here>> పురుషుల్లో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఇదే!