KCR: తెలంగాణ మళ్లీ ఇప్పుడు తిరగబడ్డది: కేసీఆర్

బ్యాంకులో సర్కారు డబ్బులేస్తే నేరుగా రైతు ఖాతాల్లోంచి తీసుకునే వీలు కల్పించామని కేసీఆర్ తెలిపారు.

KCR: తెలంగాణ మళ్లీ ఇప్పుడు తిరగబడ్డది: కేసీఆర్

తెలంగాణ మళ్లీ ఇప్పుడు తిరగబడ్డదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు సీఎం రైతు బంధు 9 తారీఖు ఇస్తానంటున్నారని చెప్పారు. నాటేసేటప్పుడు రైతు బంధు ఇస్తరా? లేక వడ్లు కొలిచేటప్పుడు ఇస్తారా? అని నిలదీశారు. తెలంగాణ వచ్చిన సమయంలో చెట్టుకొకరు పుట్టకొగలుగా తెలంగాణ బిడ్డలు ఉండేవారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో ఆయన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. అప్పట్లో నీళ్లు, కరెంటు లేవని వలసలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఫ్లోరైడ్‌తో నల్గొండ బిడ్డల నడుములు వంగిపోయిన రోజులని అన్నారు. ఎక్కడ పని మొదలు పెట్టాలో తెలుసుకుని పనులు మొదలు పెట్టామని తెలిపారు.

రాష్ట్రం వచ్చాక చెరువులపై దృష్టి పెట్టి వాటిని బాగు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. రైతులకు ఎరువులు ఇవ్వడం కంటే డబ్బులు ఇస్తే బాగుంటుందని కొందరు నిపుణులు సూచించారని చెప్పారు. ఆ డబ్బులకు రైతులే యజమానులు కావాలని చెప్పారని తెలిపారు. దేశంలో మొదటిసారిగా రైతు బంధు పథకాన్ని పుట్టించామని చెప్పారు.

బ్యాంకులో సర్కారు డబ్బులేస్తే నేరుగా రైతు ఖాతాల్లోంచి తీసుకునే వీలు కల్పించామని కేసీఆర్ తెలిపారు. సంక్షేమరంగంలో అందరినీ ఆదుకున్నామని చెప్పారు. కౌశిక్ రెడ్డిని తాను ఎమ్మెల్సీని చేసి ప్రజలకు ఇస్తే, ఆయనను ఎమ్మెల్యేను చేసి తనకు ప్రజలకు ఇచ్చారని అన్నారు. గెలిచినా ఓడినా ప్రజలకోసం పనిచేస్తూనే ఉండాలని చెప్పారు.

 Also Read: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు