Pady Crop Cultivation : ఖరీఫ్ కు అనువైన రాజేంద్రనగర్ వరి రకాలు

రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను  అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది.

Pady Crop Cultivation : ఖరీఫ్ కు అనువైన రాజేంద్రనగర్ వరి రకాలు

Pady Crop Cultivation

Pady Crop Cultivation : ఖరీఫ్ వరిసాగుకు సమయం దగ్గర పడుతుంది. రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని, విత్తనాలు సమకూర్చుకునే  పనిలో వున్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్థుతం ప్రాచుర్యంలో వున్న పాత రకాలతోపాటు, అనే కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు.

READ ALSO : Perennial Rice: సరికొత్త వరి పంట.. ఒక్కసారి నాటితే నాలుగేళ్లు పండే వరిని అభివృద్ధి చేసిన చైనా

ప్రాంతాలకు అనుగుణంగా  వీటి గుణగణాలను పరిశీలించి, ఏటా సాగుచేసే సంప్రదాయ రకాల స్థానంలో  రైతులు వీటిని సాగుకు ఎంచుకోవచ్చు . తెలంగాణాకు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ఠ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Pests in Rice : వరిపంటకు తీవ్రనష్టం కలిగిస్తున్న తెగుళ్లు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 60 నుండి 65 లక్షల ఎకరాలు. దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది . ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలు అందుబాటులో ఉన్నాయి. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి.

READ ALSO : Tobacco Leaf Picking : పొగాకు ఆకులను దండకుట్టే మిషన్ తో తీరిన కూలీల సమస్య !

రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను  అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు.

READ ALSO : Rice Varieties : ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక.. సన్నగింజ వరి రకాలు

కాబట్టి రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరిసాగులో  కీలకమైన విషయాలుగా పరిగణించాలి. ఖరీఫ్ కు అనువైన రాజేంద్రనగర్ వరి  రకాలు.. వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. చంద్రమోహన్.