Perennial Rice: సరికొత్త వరి పంట.. ఒక్కసారి నాటితే నాలుగేళ్లు పండే వరిని అభివృద్ధి చేసిన చైనా

ఒక్కసారి నాటితే నాలుగేళ్లపాటు వరుసగా కోతకొచ్చే పంటను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎనిమిదిసార్లు ఈ వరి కోతకొస్తుంది. చైనాలో ఇప్పటికే ఈ పంట పండిస్తున్నారు.

Perennial Rice: సరికొత్త వరి పంట.. ఒక్కసారి నాటితే నాలుగేళ్లు పండే వరిని అభివృద్ధి చేసిన చైనా

Perennial Rice: చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కొత్త రకం వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఒక్కసారి నాటితే వరుసగా నాలుగేళ్లు.. అంటే ఎనిమిది పంటలు పండే వరిని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే చైనాలో ఈ వరి పంట సాగు చేస్తున్నారు అక్కడి రైతులు. ‘పీఆర్-23’ పేరుతో ఈ వెరైటీ వరి రకాన్ని చైనాలోని యున్నాన్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేశారు.

India vs Bangladesh: బంగ్లాదే‌శ్‌ సిరీస్.. నేడే భారత తొలి వన్డే.. ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

అక్కడ రెగ్యులర్‌గా వాడే ఒర్జ్యా సతివా రకం వరిని, ఆఫ్రికాకు చెందిన మరో రకం వరిని సంకరం చేసి ‘పీఆర్-23’ని రూపొందించారు. ఈ వరిని ఒక్కసారి నాటితే చాలు.. కనీసం నాలుగేళ్లు, ఎనిమిది సార్లు వరి కోతకు వస్తుంది. పైగా సాధారణ వరితో పోలిస్తే దిగుబడి కూడా ఎక్కువే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెక్టార్‌కు సగటున 6.8 టన్నుల వరి పండుతుంది. అంతేకాదు ఈ పంటకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి నాటువేస్తే.. మరో ఏడు పంటల వరకు నాట్లు వేయాల్సిన ఖర్చు తగ్గుతుంది. కూలీల సమస్య ఉండదు. ప్రతిసారీ విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. అలాగే రసాయనాలు కూడా పెద్దగా వాడాల్సిన అవసరం ఉండదు.

Droupadi Murmu: నేడు ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రెండు రోజులపాటు పర్యటన

సాధారణ వరితో పోలిస్తే ఈ వరి పంట వల్ల కనీసం 58 శాతం ఖర్చులు తగ్గుతున్నట్లు అంచనా. ఇది కాలం గడిచేకొద్దీ భూమిలో గట్టిగా పాతుకుపోతుంది. వేళ్లు ఇంకా లోపలికి చొచ్చుకుపోతాయి. దీంతో దిగుబడి మరింత పెరుగుతుంది. దీంతో ఈ పంట రైతులకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే ఇది పర్యావరణానికి కూడా మేలు కలిగిస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గిస్తుంది.