Droupadi Murmu: నేడు ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రెండు రోజులపాటు పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ఏపీ వస్తుండటం ఇదే తొలిసారి.

Droupadi Murmu: నేడు ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రెండు రోజులపాటు పర్యటన

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఈ సందర్భంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో జరిగే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఏపీకి వస్తుండటంతో ఘనస్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

India vs Bangladesh: బంగ్లాదే‌శ్‌ సిరీస్.. నేడే భారత తొలి వన్డే.. ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం జగన్ స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి గౌరవార్థం ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఏపీలోని విజయవాడ చేరుకుంటారు. అక్కడ్నుంచి స్థానిక రిసార్ట్‌లో ఏపీ ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్, సీఎం జగన్ రాష్ట్రపతిని సన్మానిస్తారు. తర్వాత రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. తర్వాత ప్రత్యేక విమానంలో విశాఖ పట్నంలోని నావల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

తర్వాత విశాఖ నుంచి తిరుపతి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో విద్యార్థినులతో సమావేశమవుతారు. తర్వాత తిరుపతి నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్తారు.