India vs Bangladesh: బంగ్లాదే‌శ్‌ సిరీస్.. నేడే భారత తొలి వన్డే.. ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

బంగ్లాదే‌శ్‌ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదే‌శ్‌తో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. నేటి ఉదయం 11.30 గంటలకు తొలి వన్డే ప్రారంభమవుతుంది.

India vs Bangladesh: బంగ్లాదే‌శ్‌ సిరీస్.. నేడే భారత తొలి వన్డే.. ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

India vs Bangladesh: ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్ ముగించుకున్న టీమిండియా మరో సిరీస్‌కి సిద్ధమవుతోంది. ఆదివారం నుంచి బంగ్లాదేశ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్‌లోనే ఇండియా మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది.

Pawan Kalyan: రాజకీయ జీవితంలో ఓడిపోయాను: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఢాకాలో తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు పాల్గొంటుంది. గత న్యూజిలాండ్ సిరీస్‌తో కొత్తవారికి, యువజట్టుకు అవకాశం ఇచ్చిన భారత్ ఈసారి మాత్రం సమతూకం కలిగిన పూర్తిస్థాయి జట్టుతో రెడీ అవుతోంది. టీ20లకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్ ఈ సిరీస్‌లో ఆడుతున్నాడు. కొంతకాలంగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌కు ఈ సిరీస్‌లో చోటు దక్కింది. శిఖర్ ధావన్, రాహుల్, పంత్ తమ స్థాయికి తగ్గట్లు రాణించాల్సి ఉంది. మరోవైపు సిరీస్ విరామం తర్వాత విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. వీరికి తోడు యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ కూడా ఉండటంతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రాణిస్తే భారత్ సునాయాసంగా విజయం సాధిస్తుంది.

Delhi civic polls: నేఢే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. 250 స్థానాలకు పోటీ.. పింక్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు

స్టార్ బౌలర్ మహ్మద్ షమి గాయం కారణంగా ఈ టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు లిటన్ దాస్ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ కూడా బలంగానే కనిపిస్తోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ రాణించిందే ఎక్కువ. అందువల్ల ఆ జట్టును తక్కువగా అంచనా వేయకూడదు. బంగ్లాదే‌శ్‌లో చివరిసారిగా 2015లో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా అప్పట్లో 1-2తో సిరీస్ కోల్పోయింది. ధోని సారథ్యంలోని జట్టు పరాజయం పాలైంది. అందుకే ఈసారి అక్కడ సిరీస్ గెలవాలని ఇండియా భావిస్తోంది. మొదటి వన్డే జరగనున్న పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఇక్కడ మొదటి వన్డేలో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.