Dr. Suresh Babu : టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేత డాక్టర్ సురేష్ బాబు

డాక్టర్ సురేష్ కుటుంబానికి కుప్పంలో ఎంతో మంచి పేరు ఉందన్నారు. ఇక్కడ లక్ష మెజారిటీ సాధ్యమేనని చెప్పారు.

Dr. Suresh Babu : టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేత డాక్టర్ సురేష్ బాబు

Dr. Suresh Babu

Dr. Suresh Babu joined TDP : చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో కుప్పంలో టీడీపీ పార్టీలో డాక్టర్ సురేష్ బాబు చేరారు. డాక్టర్ సురేష్ బాబు తోపాటు అనుచరులు పెద్ద ఎత్తున ఆయన వెంట పార్టీలో చేరారు. డాక్టర్ సురేష్ బాబు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. డాక్టర్ సురేష్ బాబు తండ్రి దొరస్వామి నాయుడు కుప్పం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

కుప్పంలో ఇంతకముందు చంద్రబాబు నాయుడు పై కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ సురేష్ బాబు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన కుటుంబం నుంచి డాక్టర్ సురేష్ బాబు వచ్చారని తెలిపారు. డాక్టర్ సురేష్ పార్టీకి అదనపు బలం అని అన్నారు. తాను, సురేష్ తండ్రి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. తాను టీడీపీలోకి, ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారని తెలిపారు

Sattenapalle Constituency: సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని ఢీకొట్టడం కన్నా లక్ష్మీనారాయణ వల్ల అవుతుందా?

డాక్టర్ సురేష్ కుటుంబానికి కుప్పంలో ఎంతో మంచి పేరు ఉందన్నారు. ఇక్కడ లక్ష మెజారిటీ సాధ్యమేనని చెప్పారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఇక ఉండేది ఆరు నెలలే… ఎవరినీ వదలనని హెచ్చరించారు. మ్యానిఫెస్టోలో చెప్పినవి అన్నీ చేస్తామని తెలిపారు. సంపద సృష్టించి, పేదలకు ఇస్తామన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారు టీడీపీకి మద్దతు పలకాలని కోరారు. తాను అధికారంలో ఉంటే హంద్రీ – నీవా పూర్తి అయ్యేదని వెల్లడించారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పంను అభివృద్ది చేస్తానని తెలిపారు.