Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ నెల 19న ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

Tirumala : సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ.

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ నెల 19న ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

Tirumala (Photo : Twitter)

Tirumala Arjitha Seva Tickets : ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల కానుంది. సెప్టెంబర్ నెల కోటాను ఈ నెల 19వ తేదీన టీటీడీ రిలీజ్ చేయనుంది. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చుని టీటీడీ తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఈ నెల 19న ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చంది.

లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదే విధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ.

Ayodhya: శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం.. దీపావళికి తొలి అంతస్తు సిద్ధం

సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక, ఈ నెల 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ.

Also Read..Tirumala : శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద క్యూ లైన్ లో మార్పులు