తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జగదీశ్ రెడ్డి

రాష్ట్ర విద్యుత్ వినియోగదారులను తెలంగాణ ప్రభుత్వం కసాయిలకు అప్పచెప్పనుందని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy

Updated On : July 28, 2024 / 5:15 PM IST

అసత్యాలు, మోసాలతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు పాలన కూడా అదే విధంగా సాగుతోందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే అసత్యానికి పర్యాయపదంగా మారుతున్నారని అన్నారు.

తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి శాసన సభలో అసత్యాలు చెప్పారని జగదీశ్ రెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులను తెలంగాణ ప్రభుత్వం కసాయిలకు అప్పచెప్పనుందని ఆరోపించారు.

తాము ఒప్పందం చేసుకుంటే ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెట్టమా అని నిలదీశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచంగా మాట్లాడరని చెప్పారు. అసెంబ్లీలో తప్పించుకుపోయినప్పటికీ ఇప్పుడు బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి రావాలని సవాలు విసిరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Also Read: ఆ కంటైనర్‌తో వైసీపీకి సంబంధాలు ఉన్నాయన్నారు కదా.. ఇప్పుడు బయటపెట్టండి: బొత్స