Madhya pradesh Bus-Truck Collision: మధ్యప్రదేశ్‌లో బస్సు-ట్రక్కు ఢీ, ముగ్గురి మృతి ఏడుగురికి తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మోరీనా జిల్లాలోని దేవ్ పురి బాబా ప్రాంతంలో వేగంగా వచ్చిన డంపర్ ట్రక్కు ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు....

Madhya pradesh Bus-Truck Collision: మధ్యప్రదేశ్‌లో బస్సు-ట్రక్కు ఢీ, ముగ్గురి మృతి ఏడుగురికి తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం

Madhya pradesh Bus-Truck Collision: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మోరీనా జిల్లాలోని దేవ్ పురి బాబా ప్రాంతంలో వేగంగా వచ్చిన డంపర్ ట్రక్కు ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో(Road Accident) ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్ నుంచి ఢిల్లీకి వెళుతున్న ప్రయాణికుల బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారని, మరో ఏడుగురు గాయపడ్డారని(Three killed, 7 injured) మోరీనా జిల్లా ఎస్పీ శైలేంద్ర సింగ్ చౌహాన్ చెప్పారు.

Cyclone Biparjoy Expected To Weaken: బిపర్‌జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించామని ఎస్పీ చెప్పారు. మే 31వతేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హర్దా జిల్లాలో కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. టిమ్రీ పోలీసుస్టేషన్ పరిధిలోని పోఖర్ణి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ మరణించారు.

Putin confirms first nuclear weapons: ఫస్ట్ అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించాం..వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో పోలీసులు అప్రమత్తమై ముందుజాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.అతి వేగం వల్లనే రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పారు. రోడ్లపై వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.