WhatsApp Multi Account : వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ వచ్చేస్తోంది.. ఒకే డివైజ్‌లో మరో అకౌంట్‌కు ఈజీగా మారవచ్చు..!

WhatsApp Multi Account : వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ వచ్చేస్తోంది. ఈ ఫీచర్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వివిధ అకౌంట్ల మధ్య ఎలా మారవచ్చో అదే విధంగా వాట్సాప్ ఫీచర్ పనిచేస్తుంది.

WhatsApp Multi Account : వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ వచ్చేస్తోంది.. ఒకే డివైజ్‌లో మరో అకౌంట్‌కు ఈజీగా మారవచ్చు..!

WhatsApp working on multi-account feature but only some users will get it

WhatsApp Multi Account : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎట్టకేలకు వాట్సాప్ యూజర్లను రెండు డివైజ్‌లను ఒకే అకౌంట్ ఉపయోగించడానికి అనుమతించింది. ఆ తర్వాత వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఒక డివైజ్‌లో మల్టీ వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లను కలిగి ఉండవచ్చు. ఇతర అకౌంట్ల మధ్య సులభంగా మారవచ్చు. (Wabetainfo) నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం డెవలప్ అవుతోంది. అంటే.. వాట్సాప్ ఈ ఫీచర్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తే.. ఆండ్రాయిడ్ యూజర్లు ముందుగా ఫీచర్‌ను పొందవచ్చు.

మల్టీ అకౌంట్ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే? :
మీరు ఫస్ట్ టైమ్ మరో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత, అది మీ డివైజ్‌లో స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా లాగిన్ చేయడం ద్వారా రెండో అకౌంట్‌కు మారవచ్చు. వాట్సాప్ మీ అన్ని అకౌంట్ల పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకుంటుంది. కేవలం ఒక ట్యాప్‌తో మారవచ్చు. అకౌంట్ల లిస్టులో కూడిన మెనుని చూపిస్తుంది. మీరు ఓపెన్ చేయాలనకునే ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు.

Read Also : Fake ChatGPT Apps : ప్లే స్టోర్‌లో ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్.. మీ ఫోన్ ఫుల్ కంట్రోల్ ఇక హ్యాకర్ల చేతుల్లో.. మీ నెంబర్లతో స్కామ్ చేస్తారు జాగ్రత్త..!

మల్టీ అకౌంట్ ఫీచర్ ఎందుకంటే? :
ఈ ఫీచర్.. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వివిధ అకౌంట్ల మధ్య ఎలా మారవచ్చో అదే విధంగా ఉంటుంది. మీ వర్క్ సంబంధిత చాట్‌లు, వ్యక్తిగత చాట్‌లను ఒకే యాప్‌లో వేరుగా ఉంచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ ఫీచర్ మీ ప్రైవసీని నిర్ధారిస్తుంది. నోటిఫికేషన్‌లను నిర్వహించేందుకు సులభతరం చేస్తుంది. మీరు ఇకపై వేర్వేరు అకౌంట్ల కోసం వేర్వేరు డివైజ్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మల్టీ-అకౌంట్ ఫీచర్ ఇప్పటికీ డెవలప్ స్టేజీలో ఉంది. ఈ యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో బీటా టెస్ట్ కోసం లాంచ్ అవుతుంది. ఇది మొదట్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం (Whatsapp Business) యాప్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫీచర్ వ్యక్తిగత అకౌంట్లలో కూడా అందుబాటులో ఉంటుందో లేదో క్లారిటీ లేదు.

WhatsApp working on multi-account feature but only some users will get it

WhatsApp working on multi-account feature but only some users will get it

వాట్సాప్ వీడియో మెసేజ్ ఫీచర్ :
మల్టీ అకౌంట్ ఫీచర్‌తో పాటు, వీడియో మెసేజ్‌లను పంపడానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వాయిస్ నోట్స్ మాదిరిగానే.. మీరు 60 సెకన్ల వరకు వీడియో మెసేజ్‌లను రికార్డ్ చేయగలరు. ఈ ఫీచర్ ద్వారా మైక్రోఫోన్ ఐకాన్ వీడియో బటన్‌గా మారుతుంది. ఆపై మీ వీడియో మెసేజ్ రికార్డ్ చేయడానికి పంపడానికి దాన్ని నొక్కి పట్టుకోండి. ఒక డివైజ్‌లో మల్టీ అకౌంట్లను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది. ప్రత్యేక డివైజ్‌లు అవసరం లేకుండా అకౌంట్ల మధ్య మారడం సౌకర్యవంతంగా ఉంటుంది. అదనంగా, త్వరలో వీడియో మెసేజ్‌లను పంపడానికి మరో కొత్త ఫీచర్ రావచ్చు. ఈ ఫీచర్‌లు ఇంకా డెవలప్ స్టేజీలో ఉన్నాయి. భవిష్యత్తులో టెస్టింగ్ చేసేందుకు అందుబాటులో రానున్నాయి.

Read Also : Best 5G Phones in India : భారత్‌లో రూ. 15వేల నుంచి రూ. లక్ష 50వేల ధరలో బెస్ట్ 5G ఫోన్‌లు ఇవే.. డోంట్ మిస్..!