Janagam: స్టేషన్ ఘనపూర్‭లో అవినీతి పెరిగిందన్న కడియం.. సొంత పార్టీ ఎమ్మెల్యే రాజయ్యకు చెక్ పెడుతున్నారా?

ఇప్పటికీ అనేక తండాలలో రోడ్లు లేకపోతే, రూ.11 కోట్లతో రోడ్లకు మంజూరు ఇప్పించాను. గ్రామపంచాయతీగా అభివృద్ధి చెందిన తండాలకు నిధులు మంజూరు చేయిస్తాను. రాబోయే రోజుల్లో నియోజవర్గంలోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని హామీ ఇస్తున్నాను. మీ ఆశీర్వాదం నాపై ఉండాలి

Janagam: స్టేషన్ ఘనపూర్‭లో అవినీతి పెరిగిందన్న కడియం.. సొంత పార్టీ ఎమ్మెల్యే రాజయ్యకు చెక్ పెడుతున్నారా?

Kadiyam Srihari: తన కంచు కోట అయిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అవినీతి విపరీతంగా పెరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలుమార్లు ఈ నియోజకవర్గం నుంచి కడియం గెలిచారు. అయితే గత రెండు దఫాలుగా ఇక్కడ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఇద్దరు 9 ఏళ్లుగా ఒకే పార్టీ(బీఆర్ఎస్)లో ఉన్నారు. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యే పాలిస్తున్న నియోజకవర్గంపై కడియం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది. కడియం మళ్లీ స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారని, అందులో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యకు చెక్ పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.

Kothapalli Subbarayudu : ఎన్ని కేసులు పెట్టినా ముదునూరికి భయపడను : కొత్తపల్లి సుబ్బారాయుడు

తాజాగా నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ ‘‘స్టేషన్ ఘనపూర్ లో అవినీతి పెరిగింది. మీరిచ్చిన ఖడ్గంతో ఆ అవినీతిని అంతమొందిస్తా. నిఖార్సైన, నిజాయితీ,మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నాను. గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ధర్మసాగర్,జాఫర్ ఘడ్,స్టేషన్ ఘనపూర్ లో తండాలకు రోడ్లు వేసుకున్నాం. ఇప్పటికీ అనేక తండాలలో రోడ్లు లేకపోతే, రూ.11 కోట్లతో రోడ్లకు మంజూరు ఇప్పించాను. గ్రామపంచాయతీగా అభివృద్ధి చెందిన తండాలకు నిధులు మంజూరు చేయిస్తాను. రాబోయే రోజుల్లో నియోజవర్గంలోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని హామీ ఇస్తున్నాను. మీ ఆశీర్వాదం నాపై ఉండాలి’’ అని అన్నారు.

Maharashtra Politics: ఔరంగాజేబ్ సమాధిని సందర్శించిన అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్

ఘనపూర్ నియోజకవర్గంపై కడియం హామీల వర్షం కురిపించారు. ‘‘స్టేషన్ ఘనపూర్ లో బంజారా భవన్ తో పాటు, సేవలాల్ భవన్ కూడా నిర్మిస్తాం. స్టేషన్ ఘనపూర్‭ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆశీర్వదించి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల అభివృద్ధికి కృషి చేయాలి కానీ డబ్బులు దండుకోకూడదు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో, వైద్య ఆరోగ్యంలో ముందున్నది. 10 సంత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ కు ఒరగబెట్టింది ఏమీలేదు. తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు అక్కసు వెళ్లగక్కుతున్నాయి. సన్నాసులు, దద్దమ్మల మాటలు విని మోసపోవద్దు. రాబోయే ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్‭లో గులాబీ జెండా ఎగురవేయాలి. బండి సంజయ్ ఉత్తర కుమారునితో సమానం. స్టేషన్ ఘనపూర్ నియోజవర్గం లో తెలంగాణ అమరుడు బొజ్యనాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను’’ అని కడియం శ్రీహరి అన్నారు.