Mitchell Starc : భార్య ఆట‌ను చూడాల‌ని వ‌చ్చిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్‌.. నిరాశ త‌ప్ప‌లేదుగా

ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Mitchell Starc : భార్య ఆట‌ను చూడాల‌ని వ‌చ్చిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్‌.. నిరాశ త‌ప్ప‌లేదుగా

Mitchell Starc-Alyssa Healy

Mitchell Starc-Alyssa Healy : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన యాషెస్(Ashes ) సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia) పురుషుల జ‌ట్టు శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదిక‌గా ఇంగ్లాండ్‌(England)తో జ‌రిగిన మొద‌టి టెస్టులో రెండు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ జూన్ 28 నుంచి లార్డ్స్ వేదిక‌గా ప్రారంభం కానుంది. మొద‌టి, రెండో టెస్టుకు మ‌ధ్య ఐదు రోజుల విరామం దొర‌క‌డంతో ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Kl Rahul : కేఎల్ రాహుల్ వ‌ర్కౌట్లు .. ఇషాన్ కిష‌న్ కామెంట్ వైర‌ల్‌.. ‘మిస్ట‌ర్ ర‌జినీ ఎందుకు అంత ఎక్స్ ట్రా..’

గురువారం నాటింగ్ హామ్ వేదిక‌గా ఆస్ట్రేలియా ఉమెన్స్‌, ఇంగ్లాండ్ ఉమెన్స్ మ‌ధ్య ప్రారంభ‌మైన ఏకైక యాషెస్ టెస్టు మ్యాచ్ చేసేందుకు మిచెల్ స్టార్క్ వెళ్లాడు. సాధార‌ణ ప్ర‌జ‌లతో క‌లిసి క్యూ లైన్‌లో నిలుచోని టికెట్ కొనుక్కొని మ్యాచ్ ను చూశాడు. రెగ్యులర్ కెప్టెన్ మెగ్ లానింగ్ లేక‌పోవ‌డంతో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా అలిస్సా హీలీ(Alyssa Healy,) వ్య‌హ‌రించింది. అలిస్సా హీలీ, మిచెల్ స్టార్క్‌లు భార్యాభ‌ర్త‌లు అన్న సంగ‌తి తెలిసిందే.

Ashes 2023 : గెలిచినా, ఓడినా ఐసీసీ షాక్‌లు త‌ప్ప‌డం లేదుగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జ‌ట్ల‌కు భారీ జ‌రిమానా

భార్య‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు ఆమె ఆట‌ను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని అత‌డు బావించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అలిస్సా బ్యాటింగ్ ఎంచుకుంది. మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా 85 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 328 ప‌రుగులు చేసింది. ఎలీస్ పెర్రీ(99) ఒక్క ప‌రుగు తేడాతో సెంచ‌రీ చేజార్చుకుంది. తాహిలా మెక్‌గ్రాత్‌(61) ప‌రుగుల‌తో రాణించింది. కాగా.. అలిస్సా హీలీ మాత్రం డ‌కౌట్ అయ్యింది. దీంతో భార్య ఆట‌ను చూడాల‌ని భావించిన స్టార్క్‌కు తీవ్ర నిరాశే మిగిలింది.

సాధార‌ణ ప్రేక్ష‌కులతో పాటు టికెట్ కోసం వేచి ఉన్న స్టార్క్ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. యాషెస్ మొద‌టి టెస్టులో తుది జ‌ట్టులో మిచెల్ స్టార్క్‌కు చోటు ద‌క్క‌లేదు. అయితే.. రెండో టెస్టులో అత‌డు ఆడే అవ‌కాశాలు ఉన్నాయి.

Ashes Series: ‘బజ్‌బాల్’ క్రికెట్ వల్లే ఇంగ్లాండ్ ఓడిందంటూ విమర్శలు.. కెప్టెన్ బెన్‌ స్టోక్స్ ఏమన్నాడంటే..