Ashes Series: ‘బజ్‌బాల్’ క్రికెట్ వల్లే ఇంగ్లాండ్ ఓడిందంటూ విమర్శలు.. కెప్టెన్ బెన్‌ స్టోక్స్ ఏమన్నాడంటే..

తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా డిక్లేర్డ్ చేయడంపై చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఓడిపోయామని అంటున్నారు. అయితే, వారికి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా.. అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Ashes Series: ‘బజ్‌బాల్’ క్రికెట్ వల్లే ఇంగ్లాండ్ ఓడిందంటూ విమర్శలు.. కెప్టెన్ బెన్‌ స్టోక్స్ ఏమన్నాడంటే..

England Ben Stokes

ENG vs AUS 1st Test : ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో ఆసీస్ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో బజ్‌బాల్ క్రికెట్ విధానాన్ని అవలంభించింది. బజ్‌బాల్ క్రికెట్ వల్లే ఇంగ్లాండ్ ఓడిందనే వాదన పలువురు మాజీ క్రికెటర్ల నుంచి వినిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ముందుగా డిక్లేర్డ్ చేయడం సరికాదని, దీనివల్లే ఉత్కంఠ పోరులో ఆసీస్ విజేతగా నిలిచిందని పలువురు క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఓటమి తరువాత బజ్‌బాల్ క్రికెట్ పై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు.

ENG vs AUS 1st Ashes Test: ఇంగ్లాండ్ కొంపముంచిన ‘బజ్‌బాల్’.. ప్రతిష్టాత్మక యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత విజయం

తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా డిక్లేర్డ్ చేయడంపై చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఓడిపోయామని అంటున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు. ఆసీస్ పై ఆధిక్యం ప్రదర్శించేందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నామని బెన్ స్టోక్ చెప్పాడు. బజ్‌బాల్ క్రికెట్‌పై మేము వెనుకడుగు వేయమని, మా జట్టు తరువాతి టెస్టుల్లోనూ దూకుడైన ఆటతీరును కొనసాగిస్తుందని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ స్పష్టం చేశాడు.

Ashes Test 2023: యాషెస్ టెస్టు మొదటి రోజు.. ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు ఎందుకు నల్లటి బ్యాండ్‌లు ధరించారో తెలుసా?

టెస్టులో దూకుడుగా ఆడటం వల్లనే చివరి రోజు వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. వీక్షకులుసైతం కుర్చీల్లో కూర్చోలేనంత ఉత్కంఠ భరితంగా మ్యాచ్ ముందుకు సాగింది. ఇలా ఉత్కంఠభరితంగా మ్యాచ్ లు జరగడం వల్లనే టెస్టు క్రికెట్ కు ముఖ్యంగా యాషెస్ సిరీస్ కు పెద్ద సంఖ్యలో అభిమానులుగా మారారు. తొలి టెస్టులో ఓటమి వల్ల బాధగానే ఉంది. అయినా మా దూకుడైన ఆటతీరును కొనసాగిస్తాం. ఆస్ట్రేలియాలకు అసలైన సవాల్ ను విసురుతాం అని బెన్ స్టోక్స్ చెప్పాడు.