World Cup Qualifier : దంచికొట్టిన జింబాబ్వే బ్యాట‌ర్లు.. వ‌న్డేల్లో అత్య‌ధిక స్కోరు

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 క్వాలిఫ‌య‌ర్ టోర్నీలో జింబాబ్వే(Zimbabwe) చెల‌రేగుతోంది. గ్రూప్ ద‌శ‌లో వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో విజ‌యాలు సాధించిన జింబాబ్వే తాజాగా యూఎస్ఏతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగింది.

World Cup Qualifier : దంచికొట్టిన జింబాబ్వే బ్యాట‌ర్లు.. వ‌న్డేల్లో అత్య‌ధిక స్కోరు

Zimbabwe

World Cup Qualifier 2023 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 క్వాలిఫ‌య‌ర్ టోర్నీలో జింబాబ్వే(Zimbabwe) చెల‌రేగుతోంది. గ్రూప్ ద‌శ‌లో వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో విజ‌యాలు సాధించిన జింబాబ్వే తాజాగా యూఎస్ఏతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగింది. వ‌న్డే చ‌రిత్ర‌లో త‌న అత్య‌ధిక స్కోరును న‌మోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్ట‌పోయి 408 ప‌రుగులు చేసింది.

కెప్టెన్ సీన్ విలియమ్స్(174; 101 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శ‌త‌కం బాదగా ఓపెనర్ జోయ్‌లార్డ్ గుంబీ(78; 103 బంతుల్లో 5 ఫోర్లతో ) అర్ధ‌శత‌కంతో రాణించాడు. ఆఖ‌ర్లో సికిందర్ రజా(48; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు ), ర్యాన్ బర్ల్ (47; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో ) మెరుపులు మెరిపించాడు. యూఎస్ఏ బౌల‌ర్ల‌లో అభిషేక్ పరాద్కర్ మూడు వికెట్లు తీయ‌గా, జెస్సీ సింగ్ రెండు విక‌ట్లు ప‌డ‌గొట్టాడు.

Sunil Gavaskar : సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కెప్టెన్ కూల్ ధోని కాదు.. మ‌రెవ‌రంటే..?

ఇంతకుముందు 2006లో కెన్యాతో జరిగిన వ‌న్డే మ్యాచ్‌లో 351 పరుగుల స్కోరే జింబాబ్వేకు ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక్యం. తాజాగా దీన్ని అధిగ‌మించింది. కాగా.. జింబాబ్వే క్వాలిఫ‌య‌ర్ టోర్నీలో గ్రూప్‌-6 ద‌శ‌కు ఇప్ప‌టికే చేరుకుంది.

Ravi Shastri : ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత అత‌డే కెప్టెన్.. రోహిత్ ఇక చాలు

వన్డేల్లో జింబాబ్వే తరఫున అత్యధిక స్కోర్లు ఇవే

408/6 vs యూఎస్ఏ 2023
351/7 vs కెన్యా, 2009
340/2 vs న‌మీబీయా, 2003
338/7 vs బెర్ముడా, 2006
334/5 vs పాకిస్థాన్‌, 2015