Rishabh Pant : గ్యాంగ్‌ను క‌ల‌వ‌డం ఎప్పుడూ సంతోష‌మే.. పిక్ వైర‌ల్‌

టీమ్ఇండియా యువ ఆట‌గాడు రిష‌బ్ పంత్ (Rishabh Pant ) గ‌తేడాది డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అత‌డు కోలుకుంటున్నాడు.

Rishabh Pant : గ్యాంగ్‌ను క‌ల‌వ‌డం ఎప్పుడూ సంతోష‌మే.. పిక్ వైర‌ల్‌

Rishabh Pant met teammates

Rishabh Pant met teammates : టీమ్ఇండియా యువ ఆట‌గాడు రిష‌బ్ పంత్ (Rishabh Pant ) గ‌తేడాది డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అత‌డు కోలుకుంటున్నాడు. బెంగ‌ళూరులోని ఎన్‌సీఏ (National Cricket Academy)లో పున‌రావాసం పొందుతున్నాడు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ, ఐపీఎల్(IPL 2023), డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ (WTC Final) మ్యాచ్‌ల‌ను ఆడ‌లేక‌పోయిన పంత్ ఆసియా క‌ప్‌కు కూడా దూరంగా ఉంటాడ‌ని ఇప్ప‌టికే బీసీసీఐ తెలిపింది. వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ (ICC World Cup 2023) నాటికి అత‌డు జ‌ట్టులో చేరే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం ఎన్‌సీఏలో ఉన్న పంత్ త‌న టీమ్ఇండియా స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌ను క‌లుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు. రీయూనియ‌న్ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. కేఎల్ రాహుల్, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, చాహ‌ల్‌, శార్దూల్ ఠాకూర్‌ల‌తో పంత్ ఆ ఫోటోల్లో క‌నిపించ‌డాన్ని చూడొచ్చు. ప్ర‌స్తుతం పంత్ షేర్ చేసిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sarfaraz Khan: బీసీసీఐ వాదనల్లో నిజంలేదు.. సర్ఫరాజ్ ఖాన్ ఎప్పుడూ ఎవరి పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదు..

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

శ‌స్త్ర చికిత్స త‌రువాత కేఎల్ రాహుల్ కూడా ఎన్‌సీఏలోనే పున‌రావాసం పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఫిట్‌నెస్ సాధించి ఆసియా క‌ప్ నాటికి జ‌ట్టులో చేరేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇక వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపికైన శార్దూల్ ఠాకూర్‌, సిరాజ్, చాహ‌ల్ త‌దిత‌రులు ఎన్‌సీఏలో డెడికేటెడ్ స్ట్రెంత్ అండ్ కండిష‌నింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వీరంద‌రూ క‌లుసుకున్నారు.

ICC World Cup 2023 : ఒక‌వేళ పాకిస్థాన్ సెమీఫైన‌ల్‌కు వ‌స్తే.. జ‌రిగేది ఇదే..

ఇదిలా ఉంటే.. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ పైన‌ల్ ఓడిపోయిన టీమ్ఇండియా నెల రోజుల విరామం త‌రువాత వెస్టిండీస్‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నున్నారు. జూలై 12 నుంచి టెస్టు, జూలై 27 నుంచి వ‌న్డే, ఆగ‌స్టు మూడు నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది.