Rakesh Master : రాకేష్ మాస్టర్ సంతాప సభ.. యూట్యూబ్ ఛానల్స్ పై ఫైర్ అయిన సత్య మాస్టర్.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్..

రాకేష్ మాస్టర్ శిష్యులు.. శేఖర్, సత్య మాస్టర్స్, డ్యాన్స్ యూనియన్స్(Dance Unioun) ఆధ్వర్యంలో బుధవారం నాడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ సంతాప సభ నిర్వహించారు.

Rakesh Master : రాకేష్ మాస్టర్ సంతాప సభ.. యూట్యూబ్ ఛానల్స్ పై ఫైర్ అయిన సత్య మాస్టర్.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్..

Sekhar master emotional in Rakesh Master Condolences meet and satya master fires on you tube channels

Sekhar Master :  ఇటీవల ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్(Rakesh Master) అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. రాకేష్ మాస్టర్ శిష్యులు.. శేఖర్, సత్య మాస్టర్స్, డ్యాన్స్ యూనియన్స్(Dance Unioun) ఆధ్వర్యంలో బుధవారం నాడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభలో TFDC చైర్మన్ అనిల్ కూర్మచాలం, డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, టీవీ ఫెడరేషన్ ఫౌండర్ అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్, డ్యాన్స్ మాస్టర్లు, డాన్సర్స్ మరియు రాకేష్ మాస్టర్ గారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్ మాస్టర్ పేరు మీద 2000 మందికి అన్నదానం నిర్వహించారు.

అయితే ఈ కార్యక్రమంలో సత్య మాస్టర్ మాట్లాడుతూ.. యూనియన్స్ లో ఎవరికి, ఎలాంటి సమస్యలు ఉన్నా వచ్చేవాళ్ళు రాకేష్ మాస్టర్. చాలా మంది సమస్యలని తీర్చారు. యూనియన్ పెట్టినప్పటినుంచి ఉండి అందరికి సపోర్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ ఏదో చేస్తే మాస్టర్ అలా అయిపోయారు అని అంటున్నారు. కానీ మాకు తెలుసు, ఆయనతో మేము ఎలా ఉన్నామో. హెల్త్ బాగోక, డ్యాన్స్ చేయలేక, యూనియన్ లో కార్డు మెంబర్ షిప్ తీసేసారు, సినిమా అవకాశాలు ఎక్కువగా రాలేదు దీంతో కొంచెం డిస్టర్బ్ అయి మాస్టర్ అలా మారిపోయారు. వాళ్ళ అబ్బాయి చరణ్ కి డ్యాన్స్ యూనియన్ కార్డు ఇస్తాము. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారు, కొంతమంది రాకేష్ మాస్టర్ ని బతికి ఉన్నప్పుడు పట్టుంచుకోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ మేము చేసింది మీకు తెలియదు. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ని ఎలా చూశారో, ఆయనకి, అయన కుటుంబానికి ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలుసు. ఇష్టమొచ్చినట్టు రాయకండి. ఇకనైనా ఆ కుటుంబానికి అండగా నిలబడండి అని వ్యాఖ్యానించారు. దీంతో సత్య మాస్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

SPY Movie Twitter Review : ‘స్పై’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. నిఖిల్ ఇంకో పాన్ ఇండియా హిట్ కొట్టేసినట్టేనా?

ఇదే కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ కూడా మాట్లాడుతూ.. మేము ఇక్కడ ఉన్నామంటే ఆయనవల్లే. ఒక 8 సంవత్సరాలు ఆయన దగ్గరే ఉన్నాం. తర్వాత పని వెతుక్కుంటూ బయటకి వచ్చాం. అంతే కానీ ఆయనకు మేము దూరం కాలేదు. కొంతమంది ఏవేవో రాస్తున్నారు. అబద్దాలు రాయకండి, దాని వల్ల కొంతమంది, వాళ్ళ కుటుంబాలు ఎఫెక్ట్ అవుతారు. నిజాలు ఉంటేనే రాయండి అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రాకేష్ మాస్టర్ ని తలుచుకుంటూ శేఖర్ మాస్టర్ ఏడ్చేశారు కూడా.