Sreeleela : శ్రీలీల ప్లేస్ రష్మికకు వెళ్లిందా? శ్రీలీల గురించి నాగశౌర్య చెప్పిన సీక్రెట్..

నాగశౌర్య త్వరలో రంగబలి సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Sreeleela : శ్రీలీల ప్లేస్ రష్మికకు వెళ్లిందా? శ్రీలీల గురించి నాగశౌర్య చెప్పిన సీక్రెట్..

Naga Shaurya Revealed secret of sreeleela

Naga Shaurya :  కన్నడ సినిమాలతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల తెలుగులో పెళ్లి సందD, ధమాకా సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు 8 తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. తన డ్యాన్స్, యాక్టింగ్ తో తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఈ క్రేజ్ అంతా కూడా ఇంకా ముందే రావాలంట.

నాగశౌర్య త్వరలో రంగబలి సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. నాగశౌర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సినిమా ఛలో. ఈ సినిమాతోనే కన్నడ భామ రష్మిక తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అయితే అసలు ఛలో సినిమాలో ముందు హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారట.

Janhvi Kapoor : ఆ సినిమా కూడా ఓటీటీలోనే.. ఇక జాన్వీ కమర్షియల్ ఎంట్రీ టాలీవుడ్ తోనే..

దీని గురించి నాగశౌర్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేము మొదట ఛలో సినిమాకు శ్రీలీలనే హీరోయిన్ గా అనుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా చివరి వరకు శ్రీలీలనే హీరోయిన్ గా ఉంది. కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాలతో శ్రీలీల ప్లేస్ లో రష్మికను తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. దీంతో శ్రీలీల ఫ్యాన్స్ రష్మిక లక్కీ ఛాన్స్ కొట్టేసిందని లేకపోతే శ్రీలీల ఇంకా ముందే స్టార్ హీరోయిన్ అయ్యేదని కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక ఫ్యాన్స్ మాత్రం రష్మికను టాలీవుడ్ కి పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నారు.