Redgram Varieties : ఖరీఫ్ కు అనువైన కంది రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు . సకాలంలో విత్తడం ఒకఎత్తైతే. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు.

Redgram Varieties : ఖరీఫ్ కు అనువైన కంది రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

Redgram Varieties

Redgram Varieties : అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను, అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో రైతులు సాగుచేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో జూన్ 15 నుండి జులై వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికచేసుకొని , సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఖరీప్ ప్రారంభమైనా  సరిపడా వర్షం కురిసిన తరువాతే కందిని విత్తుకోవాలని సూచిస్తున్నారు జగిత్యాల  ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహా పరిశోధనా సంచాలకులు డా. జగన్ మెహన్ రావు.

READ ALSO : Preparation of Paddy Nursery : ఖరీఫ్ వరినారుమడులు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం శాస్త్రవేత్తల సూచనలు

తెలుగురాష్ర్టాలలో సాగవుతున్న పప్పుదినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12లక్షల ఎకరాలలో సాగవుతుంది. తెలంగాణా ప్రాంతంలో సుమారుగా 7 లక్షల ఎకరాల్లో  సాగవుతంది. ఈ ఏడాది విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంతరపంటగా కూడా సాగుచేసుకునే అవకాశం వుంది. ఈపంటలో ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా, మన రైతులు మాత్రం  కేవలం నాలుగు నుండి ఐదు క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు.

READ ALSO : Toor Dal : కందిసాగులో తెగుళ్ల యాజమాన్యం

ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు . సకాలంలో విత్తడం ఒకఎత్తైతే. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. తెలంగాణ ప్రాంతంలో ఖరీఫ్ కంది సాగుకు ఏయే రకాలు అనుకూలం, వాటి గుణగణాలు ఏవిధంగా వున్నాయో తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహా పరిశోధనా సంచాలకులు డా. జగన్ మెహన్ రావు.

READ ALSO : Toor Dal : కందిసాగులో సస్యరక్షణ

సాళ్లలోగానీ అచ్చులో గాని కంది విత్తుకోవచ్చు. కంది సాగు వర్షాధారంగా చేపడతారు కాబట్టి విత్తే సమయమూ ఋతుపవనాలను బట్టి ఉంటుంది. అయితే భూసారాన్ని  అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. అంతే కాదు మొదటి దశలో భూమి ద్వారా ఆశించే తెగుళ్ల నుండి పంటను కాపాడుకునేందుకు కచ్చితంగా విత్తన శుద్ధి చేయడంతో పాటు మొదటి దశలో వచ్చే కలుపు నివారణకు  చర్యలు చేపట్టాలి.

READ ALSO : Inter Crop : అంతర పంటలసాగు… ప్రయోజనాలు

కంది విత్తే ముందు  విధిగా దుక్కి తయారు చేసుకోవాలి. కనీసం 60 మి. మీటర్ల వర్షపాతం నమోదు అయ్యాకే విత్తుకుంటే మొలక శాతం , ఎదుగుదల కానీ సాధారణంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. విత్తేటప్పుడు ఖచ్చితంగా నాగలి వెనుకబాగాన లేదంటే సీడ్ డ్రిల్ తో గాని విత్తుకోవాలి. లేదంటే బోదెలు తయారు చేసుకొని మనుషుల ద్వారా విత్తనం మధ్య దూరాన్ని పాటిస్తే నాటుకోవాలి. బోదెలపై విత్తుకుంటే అధిక వర్షాలు వచ్చినా నీరు బయటకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. తద్వారా మొక్క మురిగిపోకుండా ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి  రైతు సోదరులు సిఫార్సు చేసిన రకాలు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి సకాలంలో పంటను విత్తుకున్నట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.