Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు చారిత్రాత్మక రికార్డు.. ఒక్కరోజులో 5 లక్షల 10వేల మంది ప్రయాణం

కొవిడ్-19 తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందిన్నారు. కానీ, తమ సిబ్బంది స్థిరమైన ప్రయత్నాలు, కృషి ద్వారా ఈ రోజు తాము ఈ విజయాన్ని చవి చూడగలిగామని తెలిపారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు చారిత్రాత్మక రికార్డు.. ఒక్కరోజులో 5 లక్షల 10వేల మంది ప్రయాణం

Hyderabad Metro Train (1)

Hyderabad Metro Train Record : కరోనా తర్వాత హైదరాబాద్ మెట్రో మెల్ల మెల్లగా ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటోంది. హైదరాబాద్ మెట్రో రైలు (HMR)లో రికార్డు స్థాయిలో ప్రయాణికులు పెరిగారు. హైదరాబాద్ మెట్రో రైలు చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. సోమవారం రోజు 5 లక్షల 10వేల మంది మెట్రోలో ప్రయాణం చేశారు.

హైదరాబాద్ మెట్రో రైలు సోమవారం(జూలై 3, 2023)న 5.10 లక్షల మంది ప్రయాణీకుల సంఖ్యతో ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ రికార్డు సంఖ్య హైదరాబాద్‌లో సౌకర్యవంతమైన,  అత్యంత సుఖవంతమైన ప్రయాణ విధానం పట్ల ప్రయాణీకుల విశ్వాసం, ఆమోదాన్ని సూచిస్తుందని మెట్రో యాజమాన్యం తెలిపింది.

Dhulipalla Narendra : ఏ కేసుల మాఫీ కోసం జగన్ ఏపీకి అమూల్ ని తీసుకువచ్చారు : ధూళిపాళ్ల

ఈ మైలురాయిని సాధించినందుకు HMR ప్రయాణీకులకు L&TMRHL, MD & CEO KVB రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్-19 తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందిన్నారు. కానీ, తమ సిబ్బంది స్థిరమైన ప్రయత్నాలు, కృషి ద్వారా ఈ రోజు తాము ఈ విజయాన్ని చవి చూడగలిగామని తెలిపారు.