Cocaine In US White House : వైట్‌హౌస్‌లో కొకైన్ కలకలం .. అమెరికా అధ్యక్ష భవనంలోకి ఎలా వచ్చింది..?!

అత్యంత పటిష్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్ష భవనంలో కొకైన్ బయటపడింది. వైట్ హౌస్ లో మాదకద్రవ్యం కొకైన్ ప్యాకెట్ కనిపించటం తీవ్ర సంచలనం రేపింది.

Cocaine In US White House : వైట్‌హౌస్‌లో కొకైన్ కలకలం .. అమెరికా అధ్యక్ష భవనంలోకి ఎలా వచ్చింది..?!

Identified Cocaine in White House

Identified Cocaine in White House : అత్యంత పటిష్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్ష భవనంలో కొకైన్ బయటపడింది. వైట్ హౌస్ (White House )లో మాదకద్రవ్యం కొకైన్ (Cocaine)ప్యాకెట్ కనిపించటం తీవ్ర సంచలనం రేపింది. ఆ సమయంలో అధ్యక్షుడు జో బైడెన్ (President Joe Biden )భవనంలో లేరు. వైట్‌హౌజ్‌లోని పడమర దిక్కున సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్ల(Secret Service agents) కు ఆదివారం (జులై,2023) రాత్రి 8.45 గంటల సమయంలో ఓ పౌడర్ ప్యాకెట్ కనిపింది. దానిపై అనుమానంతో దాన్ని స్వాధీనం చేసుకున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దాన్ని వెంటనే సీజ్ చేశారు.

అనంతరం ఆ భవనంలో ఉన్నవారిని మరో ప్రదేశానికి తరలించారు. ఆ పౌడర్ ప్యాకెట్  ను ఫైర్ అండ్ ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసు (Fire and Emergency Service)సిబ్బంది ప‌రీక్షించారు. ప‌రీక్ష‌లో అది కొకైన్ అని తేలింది. కానీ దీనిపై మరింత స్పష్టత కోసం ఆ ప్యాకెట్ ను మరిన్ని పరీక్షల కోసం పంపించారు. కానీ అది కొకైన్ అనే తేలినట్టుగా సమాచారం.

అంత పటిష్టమైన భద్రత ఉండే అధ్యక్ష భవనంలోకి ఆ పౌడ‌ర్ ఎలా వచ్చిందన్న దానిపై సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లు ద‌ర్యాప్తు చేస్తున్నామని అధ్యక్ష భద్రతకు సంబంధించిన ఏజెన్సీ వెల్లడించింది. వైట్‌హౌజ్ వెస్ట్ వింగ్ అధ్య‌క్ష భ‌వ‌నానికి స‌మీపంలోనే ఉంటుంది. ఓవల్ కార్యాలయం(Oval Office), క్యాబినెట్ రూమ్ (Cabinet Room), ప్రెస్ రూమ్( Press Room), రాష్ట్రపతి సిబ్బంది కార్యాలయాలతో పాటు మరిన్ని కార్యాలయాలు ఈ వెస్ట్ వింగ్ (West Wing)కు సమీపంలోనే ఉంటాయి.

ఇక్కడకు ప్రతీ రోజూ వందలాది మంది ప్రజలు వివిధ పనులు కోసం వస్తుంటారు. వారినందరిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే లోనికి రావటానికి అనుమతి ఇస్తారు. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌజ్ లోనికి కొకైన్ ప్యాకెట్ ఎలా వచ్చిందన్నది సంచలనంగా మారింది.