Manchu Lakshmi : మనోజ్ – మౌనికల పెళ్లి అవ్వాలని ఆ గుడికి వెళ్లి దండం పెట్టుకున్నా.. పెళ్ళికి ముందు నా ఇంట్లోనే ఉన్నారు..

ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లిని మంచులక్ష్మి దగ్గరుండి, వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి, ఇంట్లో ఒప్పించి చేసిందని వార్తలు వచ్చాయి.

Manchu Lakshmi : మనోజ్ – మౌనికల పెళ్లి అవ్వాలని ఆ గుడికి వెళ్లి దండం పెట్టుకున్నా.. పెళ్ళికి ముందు నా ఇంట్లోనే ఉన్నారు..

Manchu Lakshmi comments on Manoj and Mounika Marriage

Manchu Lakshmi :  మోహన్ బాబు(Mohan Babu) కుమార్తెగా మంచు లక్ష్మి అందరికి పరిచయమే. నటిగా, యాంకర్ గా తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమెరికా(America)లో సెటిలై, అక్కడ కొన్ని సినిమాల్లో నటించి ఇక్కడికి వచ్చింది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి స్పీచ్ లను ట్రోల్స్ చేసినా కూడా పట్టించుకోదు. అప్పుడప్పుడు మంచు లక్ష్మి తన స్పీచ్ లతోనే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.

ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లిని మంచులక్ష్మి దగ్గరుండి, వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి, ఇంట్లో ఒప్పించి చేసిందని వార్తలు వచ్చాయి. ఈ అక్కాతమ్ముళ్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. చాలా సందర్భాల్లో వీరిద్దరూ ఈ విషయాన్ని తెలిపారు. తాజాగా మంచులక్ష్మి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరి పెళ్లి గురించి మాట్లాడింది.

మంచులక్ష్మి మాట్లాడుతూ.. మనోజ్ – మౌనిక చాలా ట్రూగా లవ్ చేసుకున్నారు. వాళ్ళ పెళ్లిని ఇంట్లో ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను. నాన్న అయితే అస్సలు ఒప్పుకోలేదు. రెండు పెద్ద ఫ్యామిలీలు కావడం, రెండో పెళ్లి కావడం, ఇద్దరూ కలిసి ఉంటారా?.. ఇలా అనేక ప్రశ్నలతో పెళ్లిని ఒప్పుకోలేదు. నేను చాలా ట్రై చేసినా అవ్వలేదు. ఇక యాదాద్రి వెళ్లి లక్ష్మీనరసింహ స్వామికి దండం పెట్టుకున్నా వీళ్ళకి పెళ్లి చేయమని. అది మొక్కుకున్న కొన్ని నెలలకే వీళ్ళకి పెళ్లి అయింది. ఆ దేవుడు నా మాట విన్నాడు అనిపించింది. అందుకే పెళ్లి అయ్యాక ఇద్దర్ని తీసుకొని మళ్ళీ యాదాద్రికి వెళ్లి దండం పెట్టుకున్నాను అని తెలిపింది.

Comic Con : అసలు ‘కామిక్ కాన్’ ఏంటి? ప్రభాస్ ప్రాజెక్ట్ K ఎందుకు ‘కామిక్ కాన్’కి వెళ్తుంది?

అలాగే.. పెళ్ళికి ముందు కొన్ని రోజులు ఇద్దరూ నా ఇంట్లోనే ఉన్నారు. పెళ్లి తర్వాత కొత్త ఇల్లు తీసుకొని వెళ్లిపోయారు. అప్పట్నుంచి మౌనిక ఇంటి పనుల్లో ఏం డౌట్ వచ్చినా నాకు కాల్ చేస్తుంది. నేను సరదాగా చెప్పను అని ఏడిపిస్తూ ఉంటాను. ప్రస్తుతం వాళ్లిద్దరూ హ్యాపీగా ఉన్నారు అని తెలిపింది.