Chiranjeevi : నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చిన చిరు.. ఈసారి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గత కొన్ని రోజులుగా చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ బంగారాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ, బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఉండబోతున్నాయి అంటూ టాక్ వినిపిస్తుంది. తాజాగా చిరు తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చాడు.
![Chiranjeevi : నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చిన చిరు.. ఈసారి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్! Chiranjeevi : నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చిన చిరు.. ఈసారి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్!](https://10tv.in/wp-content/uploads/2023/07/Chiranjeevi-announce-his-next-project-under-his-daughter-sushimta-production.jpg)
Chiranjeevi announce his next project under his daughter sushimta production
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు. యంగ్ హీరోలు ఏడాది ఒక సినిమా చేయడం కూడా గగనం అయ్యిపోతుంటే చిరు మాత్రం ఏడాదికి రెండు సినిమాలను ఆడియన్స్ ముందు ఉంచుతున్నాడు. గత సంవత్సరం ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో అలరించిన మెగాస్టార్.. ఈ ఇయర్ ఆల్రెడీ వాల్తేరు వీరయ్య సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఆగష్టులో భోళా శంకర్ సినిమాని కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇక ఈ మూవీ పనులు పూర్తి అయ్యాయో లేదో మరో సినిమాని పట్టాలు ఎక్కించడానికి రెడీ అవుతున్నాడు.
Chiranjeevi : భోళా మూవీ వర్క్స్ కంప్లీట్.. అమెరికా వెకేషన్ టూర్‌కి చిరు..
చిరంజీవి తదుపరి సినిమా తన కూతురు సుష్మిత నిర్మాణంలో ఉండబోతుంది. భోళా శంకర్ పనులు మొత్తం పూర్తి చేసుకున్న చిరంజీవి ఒక చిన్న హాలీడే ట్రిప్ కి అమెరికా పయనం అయ్యాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ చిరు.. “తన తదుపరి సినిమా గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఉండబోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆ చిత్రం ఉండబోతుంది. హాలిడే నుంచి రాగానే ఆ సినిమా పనులు మొదలుపెడతాను” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు ఆ మూవీకి దర్శకుడు ఎవరని ఆలోచిస్తున్నారు.
Off to US on a short holiday with Surekha to refresh and rejuvenate before I join the shoot of my next, a hilarious family entertainer being produced by @GoldBoxEnt ! pic.twitter.com/rWTihORaWZ
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 7, 2023
గత కొన్ని రోజులుగా చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ బంగారాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ, బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఉండబోతున్నాయి అంటూ టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు వీరిద్దరిలో ఏ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడా? అని చర్చ జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ ఇప్పటి వరకు తెరకెక్కించిన చిత్రాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కావడంతో ఈ దర్శకుడే చిరంజీవి తదుపరి సినిమా తెరకెక్కించేది అని కామెంట్స్ వస్తున్నాయి. మరి చిరు ఎవరితో అనౌన్స్ చేస్తాడో చూడాలి.