Prabhas : మరోసారి ప్రభాస్‌తో పోటీకి దిగుతున్న దర్శకుడు.. ఈసారైనా ప్రభాస్ నెగ్గుతాడా..?
ప్రభాస్ తో మరోసారి బాలీవుడ్ దర్శకుడు పోటీకి సిద్దమవుతున్నాడా..? ఈసారైనా ప్రభాస్ రేస్ లో విజేతగా నిలుస్తాడా..!
![Prabhas : మరోసారి ప్రభాస్‌తో పోటీకి దిగుతున్న దర్శకుడు.. ఈసారైనా ప్రభాస్ నెగ్గుతాడా..? Prabhas : మరోసారి ప్రభాస్‌తో పోటీకి దిగుతున్న దర్శకుడు.. ఈసారైనా ప్రభాస్ నెగ్గుతాడా..?](https://10tv.in/wp-content/uploads/2023/07/The-Vaccine-War-aim-to-released-on-Prabhas-Salaar-reased-date.jpg)
The Vaccine War aim to released on Prabhas Salaar reased date
Prabhas : ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం సలార్ రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అదిరిపోవడం, అంతేకాకుండా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీని కలుగజేసింది. మొదటి పార్ట్ ని ‘Ceasefire’ పేరుతో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. అయితే అదే రోజు బాలీవుడ్ దర్శకుడు తన సినిమాని పోటీకి రెడీ చేస్తున్నాడు.
Salaar : టీజర్‌తో కేజీఎఫ్ 2 రికార్డు బద్దలుకొట్టిన సలార్.. మొదటి 5లో నాలుగు ప్రభాస్ పేరునే..
ది కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) సినిమాతో గత ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న వివేక్ అగ్నిహోత్రి.. ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్ (The Vaccine War) అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారట. గతంలో కాశ్మీర్ ఫైల్స్ ని కూడా ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ రోజునే ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు 2022 మార్చి 11నే రిలీజ్ అయ్యాయి. ఆ సమయంలో రాధే శ్యామ్ ప్లాప్ గా నిలవగా కాశ్మీర్ ఫైల్స్ సూపర్ హిట్టుగా నిలిచింది.
Chiranjeevi : నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చిన చిరు.. ఈసారి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్!
#Xclusiv… ‘THE VACCINE WAR’ TO CLASH WITH ‘SALAAR’?… #TheKashmirFiles director #VivekAgnihotri is eyeing 28 Sept 2023 for the release date of his upcoming film #TheVaccineWar… Yes, the same date that has been finalised by the makers of #Prabhas starrer #Salaar.
In the past,… pic.twitter.com/B5d3sp7ZRT
— taran adarsh (@taran_adarsh) July 6, 2023
ఇప్పుడు మళ్ళీ సలార్, వ్యాక్సిన్ వార్ ఒక డేట్ కి రిలీజ్ కాబోతున్నాయని వినబడుతుండడంతో ఈసారైనా ప్రభాస్ పోటీలో నెగ్గుతాడా? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా బాహుబలి 2 సినిమా తరువాత ప్రభాస్ ఖాతాలో సరైన హిట్టు లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్ కూడా బాగా నిరాశపరిచింది. దీంతో రెబల్ అభిమానులు ఆశలు అన్ని సలార్ పైనే ఉన్నాయి. కేజీఎఫ్ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ అంచనాలను వీరిద్దరూ ఎంతవరకు అందుకోగలరో చూడాలి.