Risks of Eating Too Fast : చాలా స్పీడ్‌గా ఆహారం తింటున్నారా? బీ కేర్ ఫుల్

కొంతమంది ఫుడ్ తినే విషయంలో అసలు తమకు తాము టైం ఇచ్చుకోరు. హడావిడిగా స్పీడ్‌గా తింటారు. అలా తరచుగా చేయడం వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయి.

Risks of Eating Too Fast : చాలా స్పీడ్‌గా ఆహారం తింటున్నారా? బీ కేర్ ఫుల్

Risks of Eating Too Fast

Risks of Eating Too Fast : కొంతమంది ఆహారం నమలకుండా చాలా వేగంగా తినేస్తారు. అలా చేయడం ఎన్ని అనారోగ్యాలకు కారణం అవుతుందో తెలుసా? చదవండి.

 

ఫుడ్ చాలా ఫాస్ట్‌గా తినడం వల్ల బరువు పెరుగుతారట. దాంతో పాటు మధుమేహం, గుండె జబ్బులు, కడుపులో రకరకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందట. కొన్ని రెస్టారెంట్లలో స్పీడ్‌గా తినే పోటీలు పెడుతుంటారు. పోటీలో గెలవాలని పాల్గొన్నవారు వేగంగా తింటారు. ఇలాంటి పోటీలు థ్రిల్ ఇస్తాయేమో కానీ.. వేగంగా తినడం ప్రమాదంలో పడేస్తుంది. తరచుగా స్పీడ్‌గా ఆహారం తీసుకోవడం వల్ల అనర్ధాలు కొని తెచ్చుకున్నట్లే.

Tomatoes Bad For Arthritis : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఆహారంలో టమోటాలను తీసుకోకూడదు ఎందుకో తెలుసా ?

ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. వేగంగా తినడం వల్ల అధిక బరువు లేదా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. వేగంగా తినేవారు తక్కువగా నములుతారు. ఓ అధ్యయనంలో తేలింది ఏమిటంటే తీరికగా తినేవారితో పోలిస్తే వేగంగా తినేవారిలో ఆకలి త్వరగా వేస్తుందట. దాంతో ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అధిక బరువు బారిన పడతారు. ఇక స్పీడ్‌గా ఆహారం తినేవారిలో శరీరం ఇన్సులిన్‌ను సమర్ధవంతంగా ఉపయోగించకపోవడం వల్ల కాలక్రమేణా అది మధుమేహానికి దారి తీయవచ్చట.

 

ఇన్సులిన్‌ను శరీరం ఎప్పుడైతే సమర్ధవంతంగా తీసుకోలేదో మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుందట. అంతేకాదు గుండె జబ్బులు, స్ట్రోక్‌లు వచ్చే అవకాశం ఉందట. స్పీడ్‌గా ఆహారం తినడం వల్ల ఎరోసివ్  గ్యాస్ట్రిటిస్ వచ్చే ప్రమాదం ఉంది. కడుపులో పుండుకి కారణమవుతుందట. స్పీడ్‌గా ఆహారం తినేవారు అతిగా తినడం వల్ల అది త్వరగా జీర్ణమవకుండా ఎక్కువసేపు ఉంటుంది. అది గ్యాస్ట్రిక్ యాసిడ్‌కు కారణమవుతుందట. స్పీడ్ గా తినడం వల్ల ఒక విధమైన ఆందోళనకు గురవుతారు. ఉక్కిరిబిక్కిరి అవుతారు. దానికి బదులు పూర్తిగా నమలడానికి, సరిగ్గా మింగడానికి కాస్త సమయం తీసుకోవాలి.

Monsoon Diet : వర్షకాలంలో ఆహారంలో నెయ్యిని తప్పనిసరిగా చేర్చుకోవడానికి 5 కారణాలు !

భోజనానికి కూర్చున్నప్పుడు ఆహారంలోని వాసన, రుచి వంటివాటిని ఆస్వాదిస్తూ తినాలి. పూర్తిగా నమిలి తినాలి. అలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. పోషకాలు శరీరాన్ని సరిగా అంది బలాన్ని ఇస్తాయి. ఈ అలవాటు లేనివారు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. నిత్యం ఎన్నో పనుల్లో బిజీగా ఉండేవారు తమ ఆరోగ్యం కోసం తమ శరీర పోషణ కోసం అవసరమైన ఆహారం తినే విషయంలో ఆ మాత్రం సమయం కేటాయించకపోతే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి అతివేగంగా ఆహారం తినేవారు కాస్త కేర్ ఫుల్‌గా ఉండండి.