Asian Games : ఆసియా క్రీడ‌లు.. కెప్టెన్‌గా రుతురాజ్‌.. జైశ్వాల్‌, రింకుసింగ్‌ల‌కు చోటు.. తెలుగ‌మ్మాయిలు అంజ‌లి, అనూష‌ల‌కు స్థానం

చైనా వేదిక‌గా ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో జ‌రిగే ఆసియా క్రీడ‌ల్లో క్రికెట్ గేమ్‌ను కూడా భాగస్వామ్యం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆసియా క్రీడ‌ల్లో పాల్గొనే భార‌త మ‌హిళ‌ల‌, పురుషుల టీ20 జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది బీసీసీఐ.

Asian Games : ఆసియా క్రీడ‌లు.. కెప్టెన్‌గా రుతురాజ్‌.. జైశ్వాల్‌, రింకుసింగ్‌ల‌కు చోటు.. తెలుగ‌మ్మాయిలు అంజ‌లి, అనూష‌ల‌కు స్థానం

men’s and women’s squads for 19th Asian Games

19th Asian Games : చైనా వేదిక‌గా ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో జ‌రిగే ఆసియా క్రీడ‌ల్లో క్రికెట్ గేమ్‌ను కూడా భాగస్వామ్యం చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో రెండు సార్లు ఈ క్రీడ‌ల్లో క్రికెట్‌ ఆడగా.. భార‌త మ‌హిళ‌ల జ‌ట్ల‌ను పంపిన బీసీసీఐ బిజీ షెడ్యూల్ కార‌ణంగా పురుషుల జ‌ట్టును పంప‌లేదు. అయితే ఈ సారి జ‌ట్టును పంపాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించుకుంది. ఈ మేర‌కు ఆసియా క్రీడ‌ల్లో పాల్గొనే భార‌త మ‌హిళ‌ల‌, పురుషుల టీ20 జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ఐపీఎల్‌లో రాణించి టీమ్ఇండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న చాలా మందికి ఈ జ‌ట్టులో చోటు క‌ల్పించారు. స్వదేశంలో ఈ ఏడాది అక్టోబ‌ర్‌5 న‌వంబ‌ర్‌19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఉన్న నేప‌థ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనే ఆట‌గాళ్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. పురుషుల టీమ్‌కు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా మ‌హిళ‌ల జ‌ట్టుకు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)నాయ‌క‌త్వం వ‌హించ‌నుంది.

Virat Kohli: మ్యాచ్ గెలవగానే విరాట్ కోహ్లీ చేసిన డ్యాన్స్ అదుర్స్ కదూ..

సెప్టెంబ‌ర్ 23 నుంచి అక్టోబ‌ర్ 8 వ‌ర‌కు ఈ పోటీలు జ‌ర‌గ‌నుండ‌గా.. పురుషుల జ‌ట్టు మ్యాచులు మాత్రం సెప్టెంబ‌ర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి. పురుషుల జ‌ట్టులో ఐపీఎల్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన య‌శ‌స్వి జైశ్వాల్‌కు ఓపెన‌ర్‌గా అవ‌కాశం ఇచ్చింది. అలాగే ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తొలిసారి జాతీయ జ‌ట్టులో చోటు సంపాదించాడు. అలాగే హైద‌రాబాద్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ, జితేశ్ శ‌ర్మ‌, ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్‌లు మొద‌టి సారి టీమ్ఇండియాలో చోటు సంపాదించారు. అటు మ‌హిళ‌ల‌ జ‌ట్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన అంజ‌లి శ‌ర్వాణి, బారెడ్డి అనూష‌లు చోటు సంపాదించారు.

ఆసియా క్రీడ‌లు..

పురుషుల జ‌ట్టు : రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, జితేశ్‌ శర్మ(వికెట్ కీప‌ర్‌), తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోయ్‌, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, శివమ్‌ మావి, శివమ్‌ దూబె, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌.

IND Vs WI: ఇషాంత్ కిషన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో ఇదిగో

స్టాండ్‌బై ఆట‌గాళ్లు : యశ్‌ ఠాకూర్‌, సాయికిశోర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, సాయిసుదర్శన్‌.

మ‌హిళ‌ల జ‌ట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), అమంజోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి సర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గయాక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్‌ కీపర్‌), అనూషా బారెడ్డి

స్టాండ్‌బై ప్లేయ‌ర్లు : హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్