Contactless Cards : మీ డెబిట్, క్రెడిట్ కార్డు కాంటాక్ట్‌లెస్ అని తెలుసా? ఎలాంటి టెక్నాలజీ వాడారు? NFC పేమెంట్ సురక్షితమేనా? పూర్తి వివరాలు మీకోసం..!

Contactless Cards : మీరు వాడే డెబిట్, క్రెడిట్ కార్డు కాంటాక్ట్‌లెస్ కార్డులని తెలుసా? ఈ కాంటాక్ట్‌లెస్ కార్డుల్లో వాడే టెక్నాలజీ ఏంటి? భద్రతపరమైన సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Contactless Cards : మీ డెబిట్, క్రెడిట్ కార్డు కాంటాక్ట్‌లెస్ అని తెలుసా? ఎలాంటి టెక్నాలజీ వాడారు? NFC పేమెంట్ సురక్షితమేనా? పూర్తి వివరాలు మీకోసం..!

Contactless cards, what is the technology used, the security issues and more

Contactless Cards : ప్రస్తుత రోజుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ప్రతి ఒక్కరూ రోజూవారీ నిత్యవసరాల కోసం ఏటీఎం కార్డులను వాడుతుంటారు. ఆన్‌లైన్ షాపింగ్ లేదా ఆఫ్‌లైన్ షాపింగ్ ఏదైనా ఈజీగా లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేసే సమయంలో సాధారనంగా మీ కార్డులో ‘ట్యాప్ పని చేస్తుందా?’ అని మిమ్మల్ని షాపర్లు అడుగుతుంటారు. ఎందుకంటే.. చాలా మోడ్రాన్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు కాంటాక్ట్‌లెస్‌గా మారాయి. చాలామంది వినియోగదారులకు కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు అంటే ఏమిటో తెలియకపోవచ్చు. అసలు ఈ కార్డులతో కలిగే ప్రయోజనాలు, భద్రతా సమస్యలు ఏంటి? కార్డులను వాడటం సురక్షితమేనా? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే వివరాలన్నింటిని పూర్తిగా తెలుసుకుందాం..

కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు అంటే ఏమిటి? :
కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లను కస్టమర్లు ఫిజికల్‌గా కార్డ్‌ని చొప్పించాల్సిన అవసరం ఉండదు. పిన్‌ను ఎంటర్ చేయాల్సిన పనిలేదు. ఈ కాంటాక్టులెస్ కార్డులతో వస్తువులు, ఇతర సేవల కోసం సులభంగా పేమెంట్ చేయడానికి అనుమతిస్తాయి. ఇటీవలి సంవత్సరాలలో ఈ కాంటాక్టులెస్ కార్డు అనేది బాగా పాపులర్ అయింది. డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు చేసుకోవచ్చు.

Read Also : Realme Pad 2 Launch : కొత్త ట్యాబ్ కావాలా? భారీ డిస్‌ప్లేతో రియల్‌మి ప్యాడ్ 2 వచ్చేస్తోంది.. ఈ డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లలో ఉపయోగించే టెక్నాలజీ ఏంటి? :
కాంటాక్ట్‌లెస్ పేమెంట్లలో ఉపయోగించే టెక్నాలజీని నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) అంటారు. ఈ NFC టెక్నాలజీ అనేది ఒక రకమైన వైర్‌లెస్ కమ్యూనికేషన్ అని చెప్పవచ్చు. డివైజ్‌లు దగ్గరగా ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసేందుకు అనుమతిస్తుంది. కాంటాక్టులెస్ పేమెంట్ల కోసం NFC టెక్నాలజీతో పేమెంట్ కార్డ్‌లో స్టోర్ చేసి ఉంటుంది. ఇది కార్డును POS వంటి టెర్మినల్ దగ్గరికి తీసుకువచ్చినప్పుడు పేమెంట్ టెర్మినల్‌తో కమ్యూనికేట్ చేసేందుకు అనుమతిస్తుంది.

కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లతో పేమెంట్లు ఎలా ప్రాసెస్ అవుతాయంటే? :
పేమెంట్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. కస్టమర్ పేమెంట్ టెర్మినల్ దగ్గర కార్డ్‌ని ఇలా ట్యాప్ చేస్తారు లేదా వేవ్ చేస్తారు. వెంటనే పేమెంట్ అయిపోతుంది. ఈ కార్డులపై కస్టమర్ తమ పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. టెర్మినల్‌లో కార్డ్‌ని చొప్పించాల్సిన అవసరం లేదు. పేమెంట్ సెకన్లలో పూర్తవుతుంది.

Contactless cards, what is the technology used, the security issues and more

Contactless cards, what is the technology used, the security issues and more

కాంటాక్ట్‌లెస్ కార్డ్‌ల ప్రయోజనాలు ఏంటి? :
కాంటాక్ట్‌లెస్ పేమెంట్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కార్డులతో పేమెంట్ చాలా వేగంగా సురక్షింతగా,సౌకర్యవంతంగా ఉంటుంది. కస్టమర్‌లు సెకన్లలో పేమెంట్లు చేయవచ్చు. ఎల్లప్పుడూ ట్రావెల్ చేసే కార్డుదారులకు బిజీగా ఉండే వ్యక్తులకు బెస్ట్ అని చెప్పవచ్చు. రెండోది.. ఈ కార్డు చాలా సురక్షితం కూడా. కాంటాక్ట్‌లెస్ పేమెంట్ కస్టమర్ వ్యక్తిగత సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసుకునేలా ఉంటుంది. అధునాతన ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. సైబర్ మోసగాళ్లు పేమెంట్ డేటాను దొంగిలించడం దాదాపు అసాధ్యమే. ఈ కాంటాక్ట్‌లెస్ కార్డులతో పేమెంట్ ఇప్పుడు చాలా మంది రిటైలర్‌లు నిర్వహిస్తున్నారు. చాలా మంది కస్టమర్‌లకు ఇదే ప్రాధాన్య పేమెంట్ మెథడ్‌గా మారింది.

కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు నిజంగా సురక్షితమేనా? :
కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లతో వచ్చే కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి చీటింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చాలా సురక్షితమైనది అయినప్పటికీ.. సైబర్ మోసగాళ్లు పేమెంట్ డేటాను ఉపయోగించి మోసపూరిత లావాదేవీలు చేసేందుకు వీలుంది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి పేమెంట్ కార్డ్ జారీచేసేవారు ట్రాన్సాక్షన్ లిమిట్, హై-వాల్యూ లావాదేవీల కోసం PIN వెరిఫికేషన్ వంటి అనేక భద్రతా చర్యలను ప్రవేశపెట్టారు. మరో ఆందోళన ఏమిటంటే. కార్డ్ స్కిమ్మింగ్ (card skimming) రిస్క్ ఎక్కువ.. కాంటాక్ట్‌లెస్ పేమెంట్ కార్డ్ నుంచి కార్డ్ వివరాలను దొంగిలించవచ్చు.

కస్టమర్‌కు దగ్గరగా నిలబడి పేమెంట్ డేటాను దొంగిలించడానికి డివైజ్ ఉపయోగించవచ్చు. ఈ భద్రతా సమస్యను నివారించడానికి పేమెంట్ కార్డ్ జారీ చేసేవారు ఎన్‌క్రిప్టెడ్ కార్డ్ డేటా, ట్యాంపర్ ప్రూఫ్ కార్డ్ చిప్‌ల వంటి అనేక రకాల యాంటీ-స్కిమ్మింగ్ సెక్యూరిటీని ప్రవేశపెట్టారు. కాంటాక్ట్‌లెస్ పేమెంట్ మనీలాండరింగ్ లేదా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కోసం ఉపయోగించే రిస్క్ కూడా ఎక్కువగా ఉంది.

ఎందుకంటే కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చాలా త్వరగా జరుగుతుంది. పిన్ వెరిఫికేషన్ అవసరం లేకుండానే చిన్న లావాదేవీలను ఎక్కువ సార్లు చేయడానికి ఉపయోగించవచ్చు. పేమెంట్ కార్డ్ జారీ చేసేవారు, రిటైలర్‌లు మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌ను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. రాబోయే రోజుల్లో కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లతో సురక్షితమైన పేమెంట్ చేయడానికి మరిన్ని సెక్యూరిటీ నిబంధనలను అమలు చేసే అవకాశం ఉంది.

Read Also : Tech Tips in Telugu : మీ క్రెడిట్, డెబిట్ కార్డు PIN ఇదేనా? హ్యాక్ చేస్తారు జాగ్రత్త.. సెక్యూరిటీ కోసం ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి!