Honor 200 5G Series : కొత్త ఫోన్ కావాలా? టెలిఫొటో కెమెరాలతో హానర్ 200 5జీ సిరీస్ ఇదిగో.. ధర ఎంతో తెలుసా?

Honor 200 5G Series : హానర్ 200 5జీ 8జీబీ+ 256జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 34,999, అయితే 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ. 39,999గా ఉంటుంది. మరోవైపు హానర్ 200ప్రో 5జీ ధర రూ. సింగిల్ 12జీబీ + 512జీబీ ఆప్షన్ ధర రూ. 57,999కు పొందవచ్చు.

Honor 200 5G Series : కొత్త ఫోన్ కావాలా? టెలిఫొటో కెమెరాలతో హానర్ 200 5జీ సిరీస్ ఇదిగో.. ధర ఎంతో తెలుసా?

Honor 200 5G, Honor 200 Pro 5G ( Image Source : Google )

Honor 200 5G Series : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ నుంచి సరికొత్త రెండు 5జీ ఫోన్లు వచ్చేశాయి. హానర్ 200 5జీ, హానర్ 200ప్రో 5జీ ఫోన్లు భారత మార్కెట్లో జూలై 18న (గురువారం) లాంచ్ అయ్యాయి. ఈ రెండూ 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చి ఉంటాయి.

ఆండ్రాయిడ్ 14-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0పై రన్ అవుతాయి. ఈ ఫోన్‌లు 100డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీని కూడా కలిగి ఉన్నాయి. హానర్ ప్రో మోడల్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా మాడ్యూల్‌ను కూడా కలిగి ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టును అందిస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు ప్రారంభంలో మేలో చైనాలో ఆవిష్కరించగా.. చౌకైన హానర్ 200 లైట్ మోడల్‌తో పాటు గత నెలలో ప్రపంచ మార్కెట్‌లలో అందుబాటులోకి వచ్చాయి.

Read Also : Honor 200 5G Series : భారత్‌కు రానున్న హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లు.. ధర వివరాలు, ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

భారత్‌లో హానర్ 200 5జీ, హానర్ 200ప్రో 5జీ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో హానర్ 200 5జీ 8జీబీ+ 256జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 34,999, అయితే 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ. 39,999గా ఉంటుంది. మరోవైపు హానర్ 200ప్రో 5జీ ధర రూ. సింగిల్ 12జీబీ + 512జీబీ ఆప్షన్ ధర రూ. 57,999కు పొందవచ్చు. ప్రామాణిక మోడల్ బ్లాక్, మూన్‌లైట్ వైట్ కలర్‌వేస్‌లో వస్తుంది. హానర్ 200 ప్రో 5జీ బ్లాక్, ఓషన్ సియాన్ షేడ్స్‌లో అందిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా జూలై 20వ తేదీ ఉదయం 12 గంటలకు (అర్ధరాత్రి) ఐఎస్‌టీ నుంచి ఈ ఫోన్‌లు దేశంలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.

జూలై 20 నుంచి జూలై 21న అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా హానర్ 200 5జీ సిరీస్ హ్యాండ్‌సెట్‌ల కొనుగోలుపై కంపెనీ ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది. ఈ సమయంలో ఐసీఐసీఐ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. కొనుగోలుదారులు కొన్ని ఇతర షరతులతో ఆఫర్‌లకు కూడా అర్హులు. రూ. 8వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ. 8,499 వరకు ఫ్రీ హానర్ అప్లియన్సెస్ పొందవచ్చు.

హానర్ 200 5జీ, హానర్ 200ప్రో 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
హానర్ 200 5జీ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే, హానర్ 200 ప్రో 5జీ కొంచెం పెద్ద 6.78-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. బేస్ వెర్షన్ క్వాల్‌కామ్ నుంచి స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. హానర్ ప్రో వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ఉంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ను కూడా రన్ అవుతుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. హానర్ 200 5జీ, హానర్ 200ప్రో 5జీ రెండూ 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 12ఎంపీ సెన్సార్, 50ఎంపీ టెలిఫోటో షూటర్‌తో వస్తాయి. వనిల్లా మోడల్‌లో సోనీ ఐఎమ్ఎక్స్906 మెయిన్ సెన్సార్ అమర్చగా హానర్ ప్రో మోడల్ H9000 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ఫ్రంట్ కెమెరాలు 50ఎంపీ సెన్సార్లను కలిగి ఉంటాయి. హానర్ ప్రో వేరియంట్‌లో సెల్ఫీ కెమెరాతో పాటు అదనపు 3డి డెప్త్ కెమెరా కూడా ఉంది.

హానర్ 200 5జీ సిరీస్ హ్యాండ్‌సెట్‌లు రెండూ 5,200mAh బ్యాటరీతో 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తాయి. హానర్ 200 ప్రో 5జీ 66డబ్ల్యూ వైర్‌లెస్ అలాగే రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్‌ల కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి మరిన్ని ఉన్నాయి.

Read Also : Jio New Annual Plan : జియో యూజర్ల కోసం కొత్త వార్షిక ప్లాన్లు.. నెలకు రూ.276.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!