Jio New Annual Plan : జియో యూజర్ల కోసం కొత్త వార్షిక ప్లాన్లు.. నెలకు రూ.276.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

Jio New Annual Plan : టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ప్రస్తుతం రెండు అద్భుతమైన వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. అందులో రూ. 3,599, రూ. 3,999. ఈ రెండు ప్లాన్‌లు తరచుగా రీఛార్జ్‌ చేసేందుకు ఇష్టపడని కస్టమర్‌లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Jio New Annual Plan : జియో యూజర్ల కోసం కొత్త వార్షిక ప్లాన్లు.. నెలకు రూ.276.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

Jio’s New Annual Plan Unlimited calling ( Image Source : Google )

Jio New Annual Plan : దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఇటీవల ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, జియో తమ యూజర్ల కోసం వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ప్రస్తుతం రెండు అద్భుతమైన వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. అందులో రూ. 3,599, రూ. 3,999. ఈ రెండు ప్లాన్‌లు తరచుగా రీఛార్జ్‌ చేసేందుకు ఇష్టపడని కస్టమర్‌లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : JioMart Users : జియోమార్ట్ యూజర్లు ఇకపై నేరుగా వాట్సాప్ చాట్‌లోనే షాపింగ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

వార్షిక ప్లాన్ వివరాలు :
ప్రస్తుతం జియో రెండు ట్రెండింగ్ వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది (రూ. 3,599, రూ. 3,999). ఈ ప్లాన్‌లు వినియోగదారులకు కాల్‌లు, డేటా మరిన్ని పెర్క్‌లతో సహా అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది. మీరు జియో సిమ్ యూజర్ అయితే, ఒక ఏడాది పాటు రీఛార్జ్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకుంటే ఈ రెండు ప్లాన్‌లలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.

రూ. 3,599 వార్షిక ప్లాన్ :
ఈ రెండింటిలో రూ. 3,599 సరసమైన వార్షిక ప్లాన్. తక్కువ ఖర్చుతో వార్షిక రీఛార్జ్ అవసరాలను అందిస్తుంది. ఈ ప్లాన్ నెలకు రూ. 276 చెల్లించాల్సి ఉంటుంది. బోనస్ మాదిరిగా కనిపించే 365 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ ఏడాది పొడవునా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అందిస్తుంది.

ఇందులోని భారీ డేటా యూజర్లకు బెస్ట్ అని చెప్పవచ్చు. 912జీబీ కన్నా ఎక్కువ డేటాను అందిస్తుంది. రోజుకు 2.5జీబీ వరకు పొందవచ్చు. అదనంగా, ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ రియల్ 5జీ డేటా ఉంటుంది. వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఉచితంగా అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కింద జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీకి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు.

రూ. 3,999 వార్షిక ప్లాన్ :
రూ. 3,999 వార్షిక ప్లాన్ 365 రోజుల పాటు కొనసాగుతుంది. రూ. 3,599 ప్లాన్ మాదిరిగానే ఈ ప్లాన్ కూడా వినియోగదారులకు 912.5జీబీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు రోజుకు 2.5జీబీని ఉపయోగించుకునేలా చేస్తుంది. వినియోగదారులు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రతిరోజూ 100 ఫ్రీ ఎస్ఎమ్ఎస్ పొందవచ్చు. ఈ ప్లాన్ జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీ సబ్‌స్క్రిప్షన్‌ల పెర్క్‌లతో పాటు ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో యూజర్లకు అలర్ట్.. ఇకపై రెండు వార్షిక ప్లాన్లు మాత్రమే.. బెనిఫిట్స్ ఇవే..!