Babar Azam : అయ్యో.. ఆజాము..! సెంచ‌రీ ఎక్క‌డ‌.. ఇంకో 87 ప‌రుగులు చేసుంటేనా..?

పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్‌(Babar Azam)ను నెటీజ‌న్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ప‌క్క దేశం వాళ్లో ఇంకెవ‌రో కాదు.. సొంత‌ అభిమానులే అత‌డిపై మండిప‌డుతున్నారు.

Babar Azam : అయ్యో.. ఆజాము..!  సెంచ‌రీ ఎక్క‌డ‌.. ఇంకో 87 ప‌రుగులు చేసుంటేనా..?

Babar Azam

Babar Azam troll : పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్‌(Babar Azam)ను నెటీజ‌న్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ప‌క్క దేశం వాళ్లో ఇంకెవ‌రో కాదు.. సొంత‌ అభిమానులే అత‌డిపై మండిప‌డుతున్నారు. ప‌సికూనలైన జింబాబ్వే, స్కాట్లాండ్ జ‌ట్ల మీద ప‌రుగులు చేయ‌డం కాద‌ని శ్రీలంక మీద చేయాల‌ని తిట్టిపోస్తున్నారు. గాలే వేదిక‌గా లంక‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో బాబ‌ర్ ఆజామ్‌ 13 ప‌రుగులే చేసి ఔట్ కావ‌డ‌మే అందుకు కార‌ణం.

Carlos Alcaraz : వింబుల్డన్ 2023 ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్ జ‌ట్టు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. గాలే వేదిక‌గా ఆదివారం నుంచి మొద‌టి టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. శ్రీలంక మొద‌ట బ్యాటింగ్ చేసింది. పాక్ పేస‌ర్ షాహీన్ అఫ్రిది ధాటికి 54 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి లంక క‌ష్టాల్లో ప‌డింది. అయితే.. ధ‌నుంజ డిసిల్వ (122; 214 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేయ‌గా సీనియ‌ర్ ఆట‌గాడు అజెంలో మాథ్యూస్ (64; 109 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ‌శ‌త‌కంతో రాణించ‌డంతో మొద‌టి ఇన్నింగ్స్‌లో శ్రీలం 312 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, అబ్రర్ అహ్మద్ చెరో మూడేసి వికెట్లు ప‌డ‌గొట్ట‌గా అఘా సల్మాన్ ఓ వికెట్ తీశాడు.

MLC T20 : కేకేఆర్‌కు ఘోర ప‌రాభ‌వం.. ఆండ్రీ ర‌స్సెల్‌, గుప్టిల్‌, న‌రైన్ ఉన్నా.. 50 కే ఆలౌట్‌.. 105 ప‌రుగుల‌తో ముంబై గెలుపు

అనంతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెన‌ర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌(1), అబుల్లా షఫీక్‌(19) విఫ‌లం కావ‌డంతో 47 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ వన్‌డౌన్ బ్యాట‌ర్ షాన్‌ మసూద్‌(39) క‌లిసి ఫామ్‌లో ఉన్న‌ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ జ‌ట్టును ఆదుకుంటాడ‌ని పాక్ అభిమానులు భావించారు. అయితే.. 16 బంతుల్లో 13 ప‌రుగులే చేసి ప్ర‌భాస్ జ‌య‌సూర్య బౌలింగ్‌లో స‌మ‌ర‌విక్ర‌మ‌కు క్యాచ్ ఇచ్చి బాబ‌ర్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌(17)కూడా విఫ‌లం కావ‌డంతో పాక్ 101 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

సౌద్ షకీల్(69 బ్యాటింగ్; 88 బంతుల్లో 6 ఫోర్లు), అఘా సల్మాన్(61 నాటౌట్; 84 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌) అర్ధ‌శ‌త‌కాల‌తో ఆదుకోవ‌డంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి పాక్ 5 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగులు చేసింది. ఇంకా 91 ప‌రుగులు వెనుక‌బడి ఉంది.

కాగా.. నిర్ల‌క్ష్యంగా ఆడి వికెట్ పాసేరుకున్న ఆజామ్‌పై అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శ‌త‌కాలు బాదేందుకు శ్రీలంక జ‌ట్టు ఏమీ జింబాబ్వే, స్కాట్‌లాండ్ జ‌ట్ల‌గా బ‌ల‌హీన‌మైది కాదూ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఫ‌న్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు అయితే.. జ‌స్ట్ 87 ప‌రుగుల తేడాతో బాబ‌ర్ శ‌త‌కం చేజారిందంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

Virat Kohli : ధోని ని అధిగ‌మించిన కోహ్లి.. స‌చిన్ రికార్డు పై క‌న్ను.. మ‌రో మైలురాయికి చేరువ‌