Satwiksairaj Rankireddy : బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి సంచ‌ల‌నం.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్‌

భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy) గిన్నిస్ వ‌రల్డ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఫాస్టెస్ట్ హిట్ కొట్టిన పురుష క్రీడాకారుడిగా గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు

Satwiksairaj Rankireddy : బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి సంచ‌ల‌నం.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్‌

Satwiksairaj Rankireddy

Satwiksairaj Rankireddy Guinness world record : భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy) గిన్నిస్ వ‌రల్డ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఫాస్టెస్ట్ హిట్ కొట్టిన పురుష క్రీడాకారుడిగా గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు. సాత్విక్ గంట‌కు ఏకంగా 565 కి.మీ వేగంతో స్మాష్ హిట్ కొట్టి ఈ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలో మ‌లేషియాకు చెందిన టాన్ బూన్ హియాంగ్ పేరిట పదేళ్లుగా ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

2013లో టాన్ బూన్ హియాంగ్ గంట‌కు 493 కి.మీ వేగంతో స్మాష్ కొట్టాడు. ఇప్పుడు దాని కంటే 72కి.మీ ఎక్కువ వేగంతో సాత్విక్ స్మాష్ కొట్ట‌డం గ‌మ‌నార్హం. జపాన్ లోని సైతామాలోని సోకాలో ఉన్న యోనెక్స్ ఫ్యాక్టరీ జిమ్నాజియంలో నియంత్రిత వాతావరణంలో సాత్విక్ ఈ రికార్డు స్మాష్ హిట్ కొట్టాడు.

Jasprit Bumrah : వ‌స్తున్నా.. వ‌చ్చేస్తున్నా.. అంటున్న బుమ్రా.. వీడియో వైర‌ల్‌

సాధార‌ణంగా ఓ ఫార్ములా వ‌న్ కారు గ‌రిష్ట వేగం గంట‌కు 372.6 కి.మీ. ఈ కారు కంటే స్పీడ్ కంటే సాత్విక్ కొట్టిన షాట్ వేగం ఎక్కువ‌. మ‌హిళ‌ల బ్యాడ్మింటన్ లో మలేషియాకు చెందిన టాన్ పియర్లీ పేరిట ఈ రికార్డు ఉంది. ఆమె గంటకు 438 కి.మీ. వేగంతో ఓ షాట్ కొట్టింది.

కొరియా ఓపెన్‌లో సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ ప్రిక్వార్టర్స్‌లోకి..

BWF సూపర్ 500 కొరియా ఓపెన్‌లో స్టార్ ద్వయం సాత్విక్-చిరాగ్ మొద‌టి మ్యాచ్‌లో విజ‌యం సాధించారు. థాయ్‌లాండ్‌కు చెందిన సుపాక్ జోమ్‌కోహ్- కిట్టినుపాంగ్ కేడ్రెన్‌లపై 21-16, 21-14 తేడాతో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. 32 నిమిషాల్లో మ్యాచ్ ముగియ‌డం విశేషం. దీంతో సాత్విక్‌సాయిరాజ్‌-చిరాగ్ జోడి రౌండ్ ఆఫ్ 16లో స్థానం సంపాదించింది.

Indonesia Open : ఇండోనేషియా ఓపెన్‌లో చ‌రిత్ర సృష్టించిన‌ సాత్విక్-చిరాగ్ జోడి

అంత‌ర్జాతీయ బ్యాడ్మింట‌న్ స‌ర్క్యూట్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ లు త‌మ ర్యాంకుల‌ను మెరుగుప‌ర‌చుకుంటున్నారు. ఇటీవ‌లే వీరు ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీ గెలిచిన సంగ‌తి తెలిసిందే.