Asia Cup 2023 Schedule : ఆసియా క‌ప్ 2023 షెడ్యూల్ వ‌చ్చేసింది.. భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా క‌ప్ 2023 షెడ్యూల్ వ‌చ్చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్య‌క్షుడు జై షా సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు.

Asia Cup 2023 Schedule : ఆసియా క‌ప్ 2023 షెడ్యూల్ వ‌చ్చేసింది.. భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

Asia Cup 2023 Schedule

Asia Cup 2023 : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా క‌ప్ 2023 షెడ్యూల్ వ‌చ్చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్య‌క్షుడు జై షా సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు ఈ టోర్నిని నిర్వ‌హించ‌నున్నారు. వ‌న్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. మొత్తం 13 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. పాకిస్తాన్‌ 4 మ్యాచ్‌లు, శ్రీలంక 9 మ్యాచ్‌ల‌కు అతిథ్యం ఇవ్వ‌నుంది.

ఆగ‌స్టు 30న మొద‌టి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ జ‌ట్ల మ‌ధ్య ముల్తాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. సెప్టెంబ‌ర్ 17న ఫైన‌ల్ మ్యాచ్ కు కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ సెప్టెంబ‌ర్ 2న జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు లంక‌లోని క్యాండీ వేదిక కానుంది.

India Women vs Bangladesh Women : కీల‌క పోరులో అద‌ర‌గొట్టిన జెమిమా రోడ్రిగ్స్.. రెండో వ‌న్డేలో బంగ్లాదేశ్ చిత్తు.. సిరీస్ స‌మం

మొత్తం ఆరు జ‌ట్లను రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భార‌త్‌, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండ‌గా.. గ్రూప్‌-బిలో శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. గ్రూప్ ద‌శ‌లో ఆరు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్‌-4కు అర్హ‌త సాధిస్తాయి.

సూప‌ర్ -4 ద‌శ‌లో గ్రూప్ ఏలో మొద‌టి స్థానంలో నిలిచిన జ‌ట్టు గ్రూప్‌-బిలో రెండ‌వ స్థానంలో నిలిచిన జ‌ట్టుతో సెప్టెంబ‌ర్ 6న మొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది. సూప‌ర్‌-4 ద‌శ‌లో చివ‌రి మ్యాచ్ సెప్టెంబ‌ర్ 15న జ‌ర‌గ‌నుంది.

SL Vs PAK 1st Test : బంతితో బ్యాట‌ర్ ప‌రుగు.. ర‌నౌట్ చేసేందుకు వెంట‌ప‌డిన కీప‌ర్‌.. నవ్వులే న‌వ్వులు.. వీడియో

ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్

ఆగస్టు 30 – పాకిస్థాన్ vs నేపాల్ – వేదిక‌ ముల్తాన్

ఆగస్టు 31 – బంగ్లాదేశ్ vs శ్రీలంక – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 2 – పాకిస్తాన్ vs భారతదేశం – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 3 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 4 – భారతదేశం vs నేపాల్ – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 5 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 6 – సూపర్ 4s – A1 vs B2 – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 9 – B1 vs B2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 10 – A1 vs A2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 12 – A2 vs B1 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 14 – A1 vs B1 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 15 – A2 vs B2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 17 – ఫైనల్ – వేదిక‌ కొలంబో

Rohit Sharma : బ‌ర్త్‌డే బాయ్‌నే గిఫ్ట్ అడిగిన రోహిత్ శ‌ర్మ‌.. పాపం ఇషాన్ కిష‌న్ ఇచ్చేనా..!